Anupama Shared Sensational Post: టిల్లు సినిమా తో సిద్దు జొన్నలగడ్డకి(Siddu Jonnalagadda) స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ సినిమాకి ముందు సిద్దు హీరోగా లేదంటే సైడ్ హీరోగా సుమారు ఒక అరడజను సినిమాలు చేసి ఉంటాడు.
అయినప్పటికీ ఆ సినిమాలు తనకి పెద్ద స్టార్ స్టేటస్ ను తెచ్చి పెట్టలేదు. ఆయా సినిమాల్లో నటనకి మంచి గుర్తింపు మాత్రమే లభించింది.
ఇక టిల్లు సినిమా ఆ రేంజ్ లో పేలడానికి కే ఒక కారణం అందులో నటించిన హీరోయిన్ అని కూడా చెప్పొచ్చు. నేహా శెట్టి(Neha Setty) చేసిన బోల్డ్ యాక్టింగ్,
అలాగే సిద్ధుతో చేసిన ముద్దు సీన్లు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. అసలు టిల్లు సినిమాలోనే ఆ రేంజ్ రొమాన్స్ ఉంది అంటే టిల్లు స్క్వేర్(Tillu Square) పేరుతో వస్తున్న ఆ సినిమా సీక్వెల్ గుంరించి ప్రత్యేకంగా చెప్పాలా ? ఇందులో రొమాన్స్ సీన్లను డైరెక్టర్ రెండింతలు లోడ్ చేసి ఉంటాడు.
గ్లామర్ డోస్ పెంచిన అనుపమ : Anupama Increased Glamour Dose
అయితే ఈ సీక్వెల్ లో నటిస్తోంది అనుపమ పరమేశ్వరన్, ఈ అమ్మడు మొన్నటివరకు ఎంతో పద్డతిగా ఒద్దికగా ఉండేది.
కానీ రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ కి పెదాలు అందించి టాలీవుడ్ ను షాక్ కి గురిచేసింది. రౌడీ బాయ్స్ లో(Rowdy Boys) ఆశిష్(Asish) తోనే ఆ రేంజ్ లో చేసిందంటే,
ఇక టిల్లు స్క్వేర్ లో సిద్దు తో ఏ రేంజ్ లో ఉంటాయో ఆ సీన్లు అని ఆమె అభిమానులు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి బెంగపడుతున్నారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లు, పోస్టర్లను బట్టి చుస్తే అది నిజమే అనిపిస్తోంది. ఇక తాజాగా టిల్లు స్క్వేర్ నుండి న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూసి అభిమానులు లబో దిబో మంటున్నారు.
ఆ పోస్టర్ లో ఈ మలయాళ భామ అనుపమ ఏకంగా సిద్దు ఒడిలో సెటిలైపోయింది. మాములుగా కూర్చుట పర్లేదు, అనుపమ కూర్చున్న ఆ పోజు చుస్తే ఆమె అభిమానుల మనసు ముక్కలైపోతుంది.
అభిమానుల హార్ట్స్ బ్రేక్ : Fans Heart Break
ఇసి చాలదన్నట్టు ఆ సినిమాలోని కొత్త పోస్టర్ ను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. సామజిక మాధ్యమాల్లో ఈ చిన్నది పెట్టిన పోస్ట్ లో ఉన్న ఫోటో చుసిన ఆమె ఫాన్స్ విపరీతంగా విచిత్రంగా రెస్పాండ్ అవుతున్నారు.
ఇలా చేస్తే ఎలా అనుపమ, ఈ సీన్ చూసి మా మనస్సు ముక్కలైపోతోంది అంటూ కామెంట్ పెడుతున్నారు. కొందరైతే గర్ల్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ అయినప్పుడు కూడా ఇంత బాధ కలగలేదు అని కామెంట్ చేశారు చమత్కారంగా.
మరెంతోమంది ఆ ఫోటోకి హార్ట్ బ్రేక్ సింబల్ ను పోస్ట్ చేశారు. అయితే ఎప్పుడు సాంప్రదాయ బద్దంగా కనిపించే నాయికలు కాస్త ఎక్స్ పోజ్ చేసినప్పుడు ఆ నాయికల అభిమానులు ఇబ్బందిపడటం సహజమే.
అందుకు ఉదాహరణగా సౌందర్యను చెప్పుకోవచ్చు. అప్పట్లో సౌందర్య(Soundarya) సినిమాల్లో చాలా పద్దతిగా కనిపించేంది, కానీ నరసింహ(Narasimha) సినిమాలో చుట్టూ చుట్టి వచ్చావా పాటకోసం కొంచం గ్లామర్ డోస్ ను పెంచింది. అది చుసిన ఆమె ఫాన్స్ తట్టుకోలేకపోయారు.