గౌరవ చట్ట సభలలో ఉన్న పార్లమెంట్ సబ్యులు కానీ ఆయా రాష్ట్రాల అసెంబ్లీ సబ్యులు కాని అవినీతికి పాల్పడి నట్లయితే వారు ఎలాంటివారు అయినాసరే కోర్టు ముందు దోషులు గానే పరిగణించాలి. దీనికి సంబందించి సుప్రీం కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది.
లంచం తో పాటు వివిధ రకాల మోసాలకు పాల్పడిన పార్లమెంట్ సబ్యులు గాని అసెంబ్లీ సబ్యులు కాని వారికి కేసుల నుండి ఎలాంటి మినహాయింపు ఉండదని చట్టం ముందు అందరు సమానమే అని నేడు కోర్టు తేల్చి చెప్పింది. చట్ట సభలలో ప్రశ్నలు కు సంబందించి కాని ఓట్లు వేసేందుకు లంచం తీసుకున్నట్లయితే వారికీ ఎలాంటి రక్షణ కల్గించ లేమని రాజ్యంగా ధర్మాసనం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిని ప్రధాని మోడీ స్వాగతించారు.
భవిష్యత్ లో స్వచ్చమైన రాజకీయాలకు ఈ తీర్పు ఎంత గానో ఉపకరిస్తుంది అని అలాగే వ్యవస్దలపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది అని ఆయన ఒక ట్వీట్ చేసారు.