ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లో డీఎస్సీ ఇప్పుడా ఇప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కల ఫలించే తరుణం రానే వచ్చింది. ఏపీ లో అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి సర్కారు(CM YS Jagan) మెగా డీఎస్సీ విడుదల చేస్తామని ఇప్పటి వరకు ఊరిస్తూ వచ్చింది.
ఎట్టకేలకు ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ(DSC) ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఏపీ క్యాబినెట్(AP Cabinet) ఆమోద ముద్ర కూడా వేసినట్టు కామచారం అందుతోంది. కాబట్టి రానున్న రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది అని నిరోద్యోగులు వినే అవకాశం ఉండనుంది.
టెట్ డీఎస్సీ విడివిడిగానే : TET & DSC Exams Seperatly
ఇక ఈ దఫా మాత్రం ఉపాధ్యాయ అర్హత పరీక్షను(TET) డీఎస్సీ(DSC) ను కలిపి కాకుండా విడివిడిగా నిర్వహిస్తారట.
పైగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష లో వచ్చిన మార్కుల లో 20 శతం వెయిటేజీ డీఎస్సీకి కి జత కూడా అవుతుంది. కాబట్టి ముందుగా టెట్ పరీక్ష నిర్వహించి ఆతరువాత డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక టెట్ పరీక్ష కు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం కానుంది.
ఒక వేళ పెద్ద సంఖ్యలో టెట్ కు దరఖాస్తులు గనుక వస్తే కేవలం 15 రోజుల్లోగానే టెట్ పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారట. ఆ పరీక్ష ముగిసిన 15 నుండి 20 రోజుల వ్యవధిలోనే డీఎస్సీ కి దరఖాస్తులు స్వీకరరణ షురూ చేస్తారట. అయితే ఏ రెండు పరీక్షలు కూడా ఆన్ లైన్ విధానంలోనే నిర్వహిస్తారు.