AP Sankranti Holidays: ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లో సంక్రాంతి(Sankranti) సందడి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ క్రమం లోనే పాఠశాలలు, కళాశాలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థుల సెలవులపై కీలక ప్రకటన వెలువడింది.
ఆంధ్ర ప్రదేశ్ లో జూనియర్ కళాశాలలకు(Junior Collages) ఏడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలోనే జనవరి 11వ తేదీ నుండి జనవరి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ,
ప్రయివేటు, ఎయిడెడ్ కళాశాలలకు సెలవులు ఇస్తున్నట్టు విద్యాశాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ సెలవులను అన్ని కళాశాలలు తప్పకుండ ఇవ్వాలని,
ఇది ప్రభుత్వ అకెడమిక్ కాలెండర్ ప్రకారం ఇస్తున్న సెలవులు కాబట్టి, దీనిని విరుద్ధంగా ఎవరైనా కళాశాలలు తెరిచి క్లాసులు నిర్వహిస్తే తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
ఇక పండుగ విషయానికి వస్తే రెండవ శనివారం 13వ తేదీ రాగా, 14వ తేదీ భోగి పండుగ ఆదివారం వచ్చింది, మకర సంక్రాతి 15వ తేదీ వచ్చింది. 16వ తేదీన ముక్కనుమ వచ్చింది. కళాశాలలు మాత్రం తిరిగి 18వ తేదీన తెరుచుకోనున్నాయి.
జూనియర్ జలేజీలకూ సెలవులు : Holidays For Junior Collages
ఇంటర్ కాలేజీలకు 7 రోజులు సెలవులు ఇచ్చిన జగన్ సర్కారు(CM Jagan), పాఠశాలలకు మాత్రం 10 రోజులు సెలవులు ఇచ్చింది. జనవరి 9వ తేదీనాడు పాఠశాల విద్యార్థులకు హాలిడేస్ ఇచ్చేశారు.
స్కూళ్ళు తిరిగి 18వ తేదీన రీఓపెన్ అవ్వనున్నాయి. వాస్తవానికి జనవరి 9వ తేదీ నుండి జనవరి 16వ తేదీ వరకు సేవవులు ఇద్దామని అనుకున్నారు,
కానీ 16వ తేదీ ముక్కనుమ (Kanuma) వచ్చింది, చాలామంది కనుమను కూడా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారు. అందుకే స్కూళ్లను తిరిగి 19వ తేదీనాడు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ సెలవులు ప్రయివేటు ప్రభుత్వ పాఠశాలలకు కూడా వర్తిస్తాయి, దీంతో ఏపీలోని పాఠశాల విద్యార్థులు ఫుల్ ఖుషి లో ఉన్నారు.
డిసెంబర్ నెలలో తుఫాన్(Cyclone) కారణంగా సెలవులు ఇవ్వడంతో ఆ సెలవులను సంక్రాతి సెలవల్లో తగ్గించాలని అనుకున్నారు. కానీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సర్కారు సంక్రాంతి సెలవులను యధావిధిగా 10 రోజులు ఇచ్చేసింది.
ఆంధ్ర తో పోల్చితే తెలంగాణ లో తక్కువ Compared to Andhra Less In Telangana
ఇక తెలంగాణాలో(Telangana) మొదట సంక్రాంతి సెలవులు తక్కువగానే ఇవ్వాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కారు భావించింది,
కానీ ఉపాధ్యాయుల నుండి వస్తున్నా విన్నపాలను ఆలకించిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం తన డెసిషన్ ను మార్చుకుని, పాఠశాలలకు జనవరి 12వ తేదీ నుండి జనవరి 18వ తేదీ వరకు సెలవులు ఇచ్చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు జనవరి 19వ తేదీన తిరిగి ప్రారంభం అవుతాయి. ఇక జూనియర్ కాలేజీల విషయానికి వస్తే వీరికి కేవలం 4 రోజులు మాత్రమే సెలవులు, 13వ తేదీ నుండి 16 వ తేదీ వరకు సెలవులు మంజూరు చేశారు.
17వ తేదీన జూనియర్ కళాశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. అయితే హాస్టళ్లలో ఉండే విద్యార్థులు దూర ప్రాంతాల్లో ఉండే తమతమ ఇళ్ళకి వెళ్లి పండుగ తరవాత మరలా తిరిగి రావాలంటే కష్టమవుతుంది.
కాబట్టి తెలంగాణ గవర్నమెంటు కూడా ఈ విషయంలో పునరాలోచన చెయ్యాలని కొందరు విన్నపాలు చేస్తున్నారు. ఇక తెలంగాణ విద్యా శాఖ కూడా సెలవుదినాల్లో పాఠశాలు, కళాశాలలు నడిపితే కఠిన శర్యాలు తప్పవని అంటోంది.