APSRTC Special Services On Festival: సంక్రాతి(Sankranti) పండుగ వచ్చిందంటే చాలు సొంత ఊళ్ళకి వెళ్లే వారు ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తుంటారు.
సొంతవాహనాలు ఉన్న వారు ఎంచక్కా రయ్ మని దూసుకుపోతుంటారు. లేని వారు ప్రభుత్వ రంగ రవాణా అంటే బస్సు, రైళ్లు(Bus &Train) వీటినే నమ్ముకుంటారు.
ఇలాంటి వారికోసమే ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఒక శుభ శుభవార్త చెప్పింది. ఈ సంక్రాతి నాటికి అదనపు సర్వీసులు నడపనున్నట్టు వెల్లడించింది.
అందులోను హైదరాబాద్(Hyderabad) నుండి ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) కి ఆంధ్ర ప్రదేశ్ నుండి హైదరాబాద్ కి మరికొన్ని ప్రత్యేక సర్వీసులు ఉంటాయని అంటోంది.
ఇందులోనూ మరో బంపర్ ఆఫర్ ఏమిటంటే ఈ స్పెషల్ సర్వీసుల్లో అదనపు రుసుము వసూలు చేయరట, కేవలం సాధారణ చార్జీలను మాత్రమే వసూలు చేస్తారని అంటున్నారు.
మొత్తం 2600 బస్సులు – Total 2600 busses
ఈ వార్తా చాలా మందికి గొప్ప శుభవార్త అని చెప్పుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనేక మంది సొంత ఊళ్లను, కుటుంబాలను విడిచి పెట్టి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ లో ఉద్యోగాల్లో లేక వ్యాపారంలో చేసుకుంటూ ఉంటారు.
అటువంటి వారు ఎప్పుడుపడితే అప్పుడు స్వగ్రాలకు వెళ్ళడానికి వీలు కాదు. కేవలం పండుగల సమయంలోనే ఇందుకు కుదురుతుంది.
పైగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకానికి సంక్రాతి అనేది చాలా పెద్ద పండుగ, ఈ పండుగను చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారు. పైగా కొత్తగా పెళ్ళైన వారు తప్పనిసరిగా అత్తారింటికి వెళ్లి తీరాల్సిందే.
కాబట్టి వీరు కేవలం హైదరాబాద్ లోనే కాదు ఎక్కడున్నా సొంత రాష్ట్రానికి రావడానికే ప్లాన్ చేసుకుంటారు. ప్రతుతం ఏపీఎస్ ఆర్టీసీ 6795 ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
అయితే వాటిలో నుండి 1600 బస్సులను కేవలం హైదరాబాద్ కు మాత్రమే నడపాలని నిశ్చయించింది. ఇవి కాకుండా మరో వెయ్యి బస్సులను అదనంగా కేటాయించనుంది భాగ్యనగరం నుండి రావడానికి.
ఈ స్పెషల్ బస్సులు కేవలం హైదరాబాద్ నుండి ఏపీకి రావడానికే కాదు, పండుగ అయిపోయాక మరల తిరిగి హైదరాబాద్ చేసుకునే వారికి కూడా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
సంక్రాంతి వేళ ప్రయివేట్ ట్రావెల్స్ కి పండగ – Private Travels Has Good Chance In Festival Season
ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అని వెనకటికి ఒక సామెత ఉండేది, దీనిని ప్రయివేటు ట్రావెల్స్(Private Travels) వారు చక్కగా చరిస్తారు.
విడి రోజుల్లో కాస్త అటు ఇటుగా డిస్కౌంట్ లు ఇచ్చే ప్రయివేటు ట్రావెల్స్ వారు సంక్రాతి సీజన్ లో డబుల్ చార్జీలు వసూలు చేస్తారు.
ఉదాహరణకు హైదరాబాద్(Hyderabad) నుండి బెజవాడ(Vijayawada) వెళ్ళడానికి నాన్ ఏసీ సీటింగ్ కి విడి రోజుల్లో 600రూపాయలు వసూలు చేస్తే సంక్రాతి సీజన్ లో 800 నుండి 1000రూపాయలు డిమాండ్ చేస్తారు.
ఇక నాన్ ఎసి స్లీపర్ ఎసి స్లీపర్ అయితే 1200 నుండి 1500 వరకు అడగొచ్చు. 2000 డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అయితే ఏపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రయివేటు ట్రావెల్స్ బుకింగ్స్ తగ్గుతాయని కూడా అనుకోలేము వాటికి ఉండే డిమాండ్ వాటికే ఉంటుంది.