Aravindh Kejriwal is likely to get jail: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(ArvindKejriwal)అధికార నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(EnforcementDirectorate) దాడి చేయబోతుందన్న న్యూస్ రాగానే కేజ్రీవాల్ నివాసానికి వెళ్లే రోడ్లన్నింటినీ బ్లాక్ చేశారు.
అదేవిధంగా ముఖ్యమైన ఎంట్రెన్స్ దగ్గర అదనపు బలగాలను కూడా ఉంచారని ఆప్ వర్గాలు తెలిపాయి. ఆయన నివాసంలో పనిచేసే సిబ్బందిని కూడా లోపలికి అనుమతించటం లేదని,
కేజ్రీవాల్ నివాసంలో దాడులు చేయటం సహా ఆయన్ను అరెస్ట్ చేసే ప్రయత్నాలను ఈడీ ముమ్మరం చేసిందని ఆప్ వర్గాలు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకు తనను బీజేపీపార్టీ (BJP )అరెస్ట్ చేయించాలని చూస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.
దిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం తన ఇమేజ్ ను దెబ్బతీయాలని బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నిస్తోందని అన్నారు.
ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఆ విషయం ఈడీకి కూడా తెలుసని చెప్పారు. చట్టబద్ధంగా సమన్లు పంపిస్తే ఈడీకి సమాధానం చెప్పేందుకు తాను సిద్ధమేనని అన్నారు.
సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal)
నివాసంలో ఈడీ(ID) దాడులు చేస్తారని కేబినెట్ మంత్రి, ఆప్ నాయకురాలు అతిషి ఆరోపించారు. ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్టును పెట్టారు.
అయితే, ఆప్ ఆరోపణలను దిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. ఆప్ మంత్రులు ప్రకటన నేపథ్యంలో మీడియా ప్రతినిధుల రాక పెరిగిందని, వారిని నియంత్రించేందుకే భద్రతను పెంచినట్లు దిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు. ఇది ఇలావుండగా కేజ్రీవాల్(ArvindKejriwal)
గుజరాత్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధత కోసం ఆయన గుజరాత్‌కు వెళ్తారని ఆప్ వర్గాలు తెలిపాయి. మూడు రోజుల పాటు గుజరాత్లో ఆయన పర్యటిస్తారని,
ఆ సమయంలో బహిరంగ సభల్లో కూడా పాల్గొంటారని, అక్కడ ఆ పార్టీ వర్గాలతో కూడా చర్చలు జరుపుతారని వివరించాయి. అలాగే, జైలుకు వెళ్లిన ఆప్ నేత చైతర్ వాసవను కూడా కలుస్తారని తెలిపాయి.