సాయంత్రం వేళ ఈ పనులు చేస్తున్నారా, అయితే దరిద్రం కొని తెచ్చుకున్నట్టే!

97568598 సాయంత్రం వేళ ఈ పనులు చేస్తున్నారా, అయితే దరిద్రం కొని తెచ్చుకున్నట్టే!

మనలో చాల మంది పెద్ద వాళ్ళు ఎం చెప్పిన పట్టించుకోము, ఆ ఎం జరుగుతుంది లే అని కొట్టిపరేస్తుంటాం! కాని ఇప్పుడు చెప్తున్న విషయాలు పలు శాస్త్రాలలో చెప్పడం జరిగింది. శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ డబ్బులు అప్పు ఇవ్వడం కాని అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం కాని చెయ్యకూడదు.

అసలు సాయంత్రం పూట ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉంటేనే మంచిదని పండుతులు చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంత మినహాయింపు ఉందని వ్యాపారం చేసే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకున్న అనంతరం ఎటువంటి ఆర్ధిక వ్యవహారాలకు అయిన డబ్బు వస్తు మార్పిడి చేసుకోవచ్చు అని శాస్త్ర పండితులు చెప్తున్నారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలింగించిన సమయంలో చీపురుతో ఇల్లు ఊడ్చడం చెయ్యకూడదు.

అలా చెయ్యడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఇలా చెయ్యడం వల్ల ఆ వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి పై ప్రభావం చూపిస్తుందని అందుకనే చీపురు తో ఇల్లు ఊడ్చడం చెయ్యకూడదు. కొందరు తెలుసో తెలియకో సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కలో నీరు పోస్తూ ఉంటారు అలా పొయ్యకూడదు. ఎందుకంటే తులసి మొక్క లక్ష్మీదేవి శాశ్వత నివాస స్థానం కాబట్టి నీరు పోయకూడదు.

అంతే కాదు ఆ సమయంలో తులసి కోటని శుభ్రం చేయటం కాని , ఆకులని తుంచటం కాని చేయకూడదు. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని పురాణాలలో చెప్పడం జరిగింది. సాయంత్రం పూట లైట్లు వేసిన తర్వాత తులసి మొక్కని తాకకుండా దీపం పెట్టుకోవడం వల్ల ఆ ఇంట సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి.

దీపాలు వెలిగించిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం మూసి ఉంచకూడదు తెరిచే ఉంచాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇదేనని, అందువల్ల ఈ సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచటం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాదనీ పెద్దలు చెప్తారు. ఎట్టిపరిస్థితుల్లోను సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఎప్పుడూ గొడవ పడడం చెయ్యకండి. దీపాలు వెలిగించిన అనంతరం సాయంత్రం వేళ పడుకోవడం కుడా చెయ్యకూడదు.

ఎవరైనా అనారోగ్య సమస్యలతో భాదపడుతూ ఉంటె తప్ప మిగిలిన వాళ్ళు పడుకోవడం చెయ్యకూడదు.మన ఇంటిలో చిన్న పిల్లలు ఆడుకున్న తర్వాత సాయంత్రం సమయంలో గుమ్మం మీద ఆడపిల్లలు కూర్చుంటారు. అలా కూర్చోకూడదు అని, దీని వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ పనులు చేయకండి, చేసి కోరి దరిద్రాన్ని తెచ్చుకోకండి.

Disclaimer:
ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మీకు అందించడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ 6Tv ఇవ్వడం లేదు. అలాగే ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. మా ఉద్దేశం సమాచారం అందించడం వరకు మాత్రమే. ఏదైనా పాటించే ముందు లేదా సందేహాలు ఉన్న సంబంధిత నిపుణుల సలహా తీసుకోమని మనవి చేస్తున్నాం.

Leave a Comment