లులూ మాల్ కి వెళ్తున్నారా ! కుల్ఫీ లో బోనస్ గా కదులుతున్న పురుగులు

website 6tvnews template 2024 04 01T112629.997 లులూ మాల్ కి వెళ్తున్నారా ! కుల్ఫీ లో బోనస్ గా కదులుతున్న పురుగులు

మన భారత దేశ వ్యాప్తంగా లులూ మాల్ కి ఎంతో క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అంతే కాదు అక్ఇకడ దొరికే అన్ని రకాల వస్తువులతో పాటు రక రకాల తినుబండారాలు కూడా దొరకడం తో కస్టమర్లు ఎప్పుడు ఎగబడుతుంటారు. ఈ మధ్యన లులూ మాల్ కి వచ్చే కస్టమర్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడడం మనం తరచూ చూస్తున్నాం. ఎందుకంటే మాల్ఆ నిర్హావాహకులు ఆహార విషయంలో సరైన నాణ్యత పాటించడం లేదని ఎన్నో ఆరోపణలు కుడా వస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇక్కడ ఎన్నో రక రకాల ఐటమ్స్ కొని తింటూ ఉంటారు. అలా తింటుండగా ఓ కస్టమర్ కి తను తినే ఐస్ క్రీమ్ ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఇంతకీ ఆ ఐస్ క్రీమ్ లో ఏముందో తెలుసా ! ఇపుడు దీనికి సందించిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇప్పుడు మన దేశం అంతటా ఎండలు మండిపోతున్నాయి. దీంతో చిన్నా పెద్ద అందరు చల్లని కూల్ డ్రింక్స్ వైపు పరుగులు పెడుతున్నారు. సమ్మర్ సీజన్ వస్త ఇక పిల్లలకి పండగే ఎందుకంటే నెలలు తరబడి సెలవులు వస్తాయి కాబట్టి. దీంతో తల్లిదండ్రులతో కలిసి సినిమాలు అంటూ , పార్కులు అని , షాపింగ్ మాల్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు కుటుంబ సబ్యులు అంతా. ఇక తాజాగా జరిగిన సంఘటన చూస్తే యూపీలోని లక్నోలో లులూ మాల్ లో ‘ఫలుదా నేషన్’ అనే కూల్ డ్రింక్స్ షాప్ లో ఓ కస్టమర్ కుల్ఫీ కొన్నాడు. కుల్ఫీ విప్పి చూడగానే అందులో కదులుతున్న పురుగులు చూసే సరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి.

ఆ వీడియో చూసి కంగారు పడ్డాడు ఆ షాప్ ఒనర్, కస్టమర్ కి వేరే కుల్ఫీ ఇస్తానని వేడుకున్నాడు. అందుకు కస్టమర్ మాత్రం తనకు వద్దని చెప్పడం తో కుల్ఫీ డబ్బులు తిరిగి ఇచ్చేసాడు షాప్ ఓనర్. గతంలో కూడా లులూ మాల్ లో ఇలా నాణ్యత లేని ఆహారం సప్లై చేసారని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ వీడియో చూసి ఇప్పటికీ లులూ తీరు మార్చుకోవడం లేదంటూ మాల్ కి వచ్చే కస్టమర్ లు ఫైర్ అవతుతున్నారు.

Leave a Comment