ఇంటికి నేమ్ ప్లేట్ పెడుతున్నారా, ఇలా చెయ్యండి !

website 6tvnews template 2024 04 01T174126.468 ఇంటికి నేమ్ ప్లేట్ పెడుతున్నారా, ఇలా చెయ్యండి !

Are you putting a name plate at home, do this! : వాస్తు శాస్త్రమనేది కేవలం గృహ నిర్మించుకోవడానికి సంబందించినదే కాదు, ఇల్లు కట్టు విధానంలోనే కాదు, ఇంటికి ముందు పేట్టె నేం ప్లేట్ ఇలాంటి వాటికి కుడా సంబందించినదే.

ఒక ఇంటికి పెట్టిన అదే పేరును మరొక ఇంటికి నేం-ప్లేట్ లాగ పెట్టకూడదు అని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంటి కి పేరు అనేది ఎప్పటికీ ప్రత్యేకమైనది గానూ, మీ ప్రాంతాలలోని మరొకరి ఇంటికి పేరు లేకుండా చూసుకోవాలి.

మనం ఇంటికి పేరు సెలెక్ట్ చేసేటపుడు ఆ పేరు అర్ధాన్ని తెలిసిఉండాలి. ఇది గుర్తించుకోవాలి. కొందరు వ్యక్తులు నేం – ప్లేట్ మీద మంచి శబ్దాల కలయిక ఉండేలా పెట్టుకుంటారు. దీనివల్ల ప్రతికూల దృష్టి పడుతుంది . కాబట్టి అటువంటివి వాడకూడదని గుర్తుంచుకోండి.

పవిత్రమైన పేర్లను మాత్రమే ఆ ఇంటికి ఉండేలా చూసుకుంటే మనకు మన ఇంటికి రక్షణ అవుతుందని వాస్తు శాస్త్ర పండితులు చెప్తున్నారు. పేరు స్పష్టంగా లేని పక్షంలో, అది ప్రతికూల అనర్థాలను కలిగే అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు.

నేం – ప్లేట్ ప్రధాన తలుపుకు ఎడమ వైపున ఉండేలా చూసుకోవాలని అలాగే నేం – ప్లేట్ ఉంచబడిన ఎత్తు, ప్రధాన తలుపుకు సగం ఎత్తు కన్నా కొద్దిగా పైన ఉండేలా అమర్చు కోవాలని చెప్తున్నారు దీని వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని చెప్తున్నారు పండితులు. వృత్తాకారం అంటే సర్కిల్ గా కాని , త్రిభుజాకారం అంటే ట్రయాంగిల్ గా కాని ఇలాంటి ఆకారంలో ఉన్నట్లయితే, నేం – ప్లేట్ సానుకూల పవనాలను ఇస్తుందని చెప్తున్నారు వాస్త్ర శాస్త్ర నిపుణులు.

నేం – ప్లేట్ లోని కంటెంట్ గరిష్టంగా రెండు లైన్లలోనే ఉండేలా చూసుకోండి. కొందరు పక్షులు కాని జంతువులు బొమ్మలు కాని నేం – ప్లేట్ పెట్టుకుంటారు అలా చెయ్యకూడదు. అలాచేస్తే నెగిటివ్ రేసస్ ఏర్పడి కుటుంబం లో చికాకులు ఏర్పడతాయని చెప్తున్నారు పండితులు. గాలికి ఊగుతున్నల్టు ఉంటె అరిష్టం అని చెప్తున్నారు పండితులు కాబట్టి గాలికి కదలకుండా ఉండేలా చూసుకోండి.

నేం – ప్లేట్ పాడవడం కాని దెబ్బతిని పాడవడం కాని జరగకుండా సుకోవాలి. చెదలు లాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దుమ్ము చేరకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో మీ నేం – ప్లేట్లో రంధ్రాలు అంటే డిజైన్ తో కూడిన రంద్రాలు ఉండకూడదు. అలా ఉంటె ఇంటికి అరిష్టం అని చెప్తున్నారు వాస్తు నిపుణులు.నేం – ప్లేట్ దగ్గరలో కాని సింహ ద్వారం తలుపు దగ్గర చీపురు, మాప్ వంటి వస్తువులను అలాగే శుభ్రపరచే వస్తువులు, డస్ట్ బిన్ వంటివి ఉంచకూడదు.

నేం – ప్లేట్ రంగు యజమాని యొక్క రాశిచక్రం ఆధారం గా ఉండాలి. అయితే నేం – ప్లేట్ మీద ఉండే అక్షరాలను జ్యోతిష్కుని సహాయంతో రంగు అక్షరాలు అలాగే ప్లేట్ రంగు ఇవన్ని సరిగ్గా ఉన్నాయి అనుకున్న తర్వాతే నేం – ప్లేట్ తయారు చేయించుకోండి. ఒకవేళ రంగు మారితే వెంటనే మార్చి వేరొక నేం – ప్లేట్ వీలయినంత త్వరగా ఏర్పాటు చేసుకోండి.

Leave a Comment