Are you shopping on Saturday? These mischievous poor people are after you : మన హిందూ మతంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి ప్రార్థించడం మనకు ఆనవాయితీ అలాగే ఆ దేవుడిని కొలవడానికి ప్రాధాన్యతను ఇస్తాం.
మనం ప్రత్యేకం గా ఏరోజు ఏ దేవుడుని పూజిస్తామో చూసినట్లయితే సోమవారం రోజున పరమశివుడ్ని మంగళవారం నాడు ఆంజనేయుని దుర్గాదేవిని బుధవారం రోజున వినాయకుడుని గురువారంనాడు శ్రీమహావిష్ణువుని, సరస్వతిని శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీదేవిని శనివారం నాడు శనిదేవుని అలాగే కాళికాదేవి నీ ఆంజనేయుని కూడా కలుస్తాం, ప్రత్యేకంగా ఆదివారం నాడు సూర్య భగవానుడిని ప్రార్దిస్తాము.
ఇలా పూజించడం వల్ల అద్భుత ఫలితాలను మనం చూడవచ్చు. శని దేవుడిని న్యాయాధిపతిగా పురాణాల్లో చెప్పబడింది. మానవులు చేసే పాప పుణ్యాలు ఆధారంగా శని దేవుడు వారి కర్మలను బట్టి కరుణించి కటాక్షిస్తాడు.
శనివారం రోజున చెయ్యాల్సినవి – చెయ్యకూడనివి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే శనివారం నాడు కొన్ని వస్తువులు మనం కొనకూడదు అలా కొని నట్లయితే శని దేవుని ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది. అందువల్ల శనివారం నాడు కొన్ని వస్తువులు కొనడం వలన అశుభాలు ఏర్పడతాయని పండితులు చెప్తున్నారు. శాస్త్ర ప్రకారం చూసినట్లయితే శనివారం నాడు ఇనుముతో చేసినవి వస్తువులు అస్సలు కొనకూడదు. శనివారం నాడు ఇనుముతో చేసిన వస్తువులు కొనినట్లయితే దరిద్రాన్ని కూడా కొని తెచ్చుకున్నట్లే. ఎట్టి పరిస్థితుల్లోనైనా శనివారం నాడు ఇనుప వస్తువులు కొనకండి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనివారం రోజున ఉప్పు కొనడం అంత మంచిది కాదని పండితులు చెప్తున్నారు. అలా కొనడం వల్ల అనారోగ్య సమస్యలకు గురవ్వాల్సి వస్తుంది.
బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే శనివారం రోజున గోర్లు తీయడం , అదే రోజున చాలామంది సెలూన్ కి వెళ్తారు అది కూడా మంచిది కాదు. శనివారం రోజున ఇలా చేయడం వల్ల ఎన్నో దోషాలు కలుగుతాయి. శనివారం రోజున మద్యం మాంసం తినకుండా సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది.
శనివారం రోజున అశ్వద్ధ వృక్షాన్ని పూజించినట్లయితే ఎలాంటి కష్టాలు మన దరి చేరవు. శనివారం రోజున మనం నువ్వులు కొంటే ఆ రోజున ఏ పని చేసినా ఆటంకాలు ఏర్పడతాయి. శనివారం రోజున శనీశ్వరుడికి నువ్వులు ఆవనూనెను నైవేద్యంగా పెట్టినట్లయితే శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు.
శనివారం రోజున ఎట్టి పరిస్థితులను నల్లని వస్తువులు కొనకండి ఉదాహరణకి నల్ల నువ్వులు, నల్ల బూట్లు. నల్లని వస్తువులు కొనడం వల్ల దరిద్రం మీ వెంటే మీ ఇంటికి వస్తుంది. మనిషి అన్నాక ప్రతివారికి అంతో ఇంతో శనిదోషం ఉండడం సహజం, ఇలాంటి వారికి శని దోషాలు పోవడానికి శనీశ్వరుడికి బెల్లం మరియు నల్ల నువ్వులు తో కలిపి నైవేద్యంగా సమర్పిస్తే ఎటువంటి దోషాలు ఉన్న పోతాయి.
శనివారం రోజున చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో నల్లని పాదరక్షలు, నల్లని దుప్పట్లు, నల్ల నువ్వులు, నల్లని గొడుగులు అలాగే ఇనుముతో తయారుచేసిన వస్తువులు కొనడం చేయకండి.దీనివలన శని ప్రభావం తగ్గి సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. శనివారం రోజున శనీశ్వరుని కొలువు కొలిచి ఆయన అనుగ్రహం పొందడం ద్వారా సుఖ సంతోషాలతో ఉండండి.