Google wants to be alert: మీరు ఆ యాప్ వాడుతున్నారా.. అప్రమత్తంగా ఉండాలంటున్న గూగుల్.

Are you using that app.. Google wants to be alert.

Google wants to be alert: మీరు ఆ యాప్ వాడుతున్నారా.. అప్రమత్తంగా ఉండాలంటున్న గూగుల్.

టెక్నాలజీ పెరుగుతుంటే మనుషులకు అనేక విషయాలలో పని సులభతరం అవుతోంది. అనేక విధాలుగా లాభదాయకం అవుతోంది టెక్నాలజీ. కానీ పెరుగుతున్న సాంకేతికత తో ఎంత స్థాయిలో మంచి ఉందొ అంతే స్థాయిలో చేదు కూడా ఉంది. అంత కన్నా ఎక్కువే ఉందని చెప్పినా తప్పు లేదేమో.

అందుకు చక్కని ఉదాహరణ గా మన మొబైల్ లో కనిపించే మోసపూరిత యాప్ లను చెప్పుకోవచ్చు. యాండ్రాయిడ్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వచ్చాక మనం బ్యాంకు కి ఏళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గింది అని చెప్పొచ్చు.

ఒకప్పుడు అకౌంట్ లో మని డిపాజిట్ చేయాలన్నా, మన అకౌంట్ నుండి వేరే వారికి మని ట్రాన్స్ఫర్ ఛేస్యలన్నా బ్యాంకు కు వెళ్లి క్యూ లైన్ లో నిలబడి మన వంతు వచ్చేవరకు వేచి ఉండి ఆయా పనులు పూర్తి చేసుకునేవాళ్లం, కానీ ఇప్పుడు ఎక్కువశాతం బ్యాంకు లావాదేవీలు మన మొబైల్ లోనే చేసుకుంటున్నాం.

అందుకు టెక్నాలజి మనకు ఎంతగానో ఉపకరిస్తోంది. అయితే ఇప్పుడు ఆ టెక్నాలజీ మనకు శాపంగా అక్రమార్కులకు ఆయుధంగా మారుతోంది.

మనం స్మార్ట్ ఫోన్ లేదంటే ఆండ్రాయిడ్ ఫోన్ వాడేటప్పుడు మనకు అనేక రకమైన యాప్ లు దర్శనమిస్తాయి, వాటిని డౌన్ లోడ్ చేసుకుంటే ఆ ఉపయోగం ఉంది, ఈ యూ[ప్రయోగం ఉంది అంటూ ఊరిస్తూ ఉంటాయి.

ఒక్కసారి గనుక టెంప్ట్ అయ్యామంటే అంతే సంగతి, వారి ఉచ్చులో పడ్డామంటే మన నెత్తిమీద కుచ్చుటోపి పెట్టి గోల్మాల్ గోవిందా అనిపిస్తారు. అలంటి యాప్లలో ప్రధానమైనవి లోన్ యాప్స్.

అతి తక్కువ వడ్డీ రేటుకి డబ్బు ఇస్తామని చెబుతూ మనల్ని బుట్టలో వేసుకునే 17 రకాల మోసపూరిత యాప్లను ప్లేస్టోర్​ నుంచి తొలగించింది టెక్​ దిగ్గజం గూగుల్. స్లోవాక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ESET ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకుని ఈ యాప్లను ప్లే స్టార్ లో కనిపించకుండా చేసిందట.

ఈ తరహా యాప్ లను స్పై లోన్స్ గా పేర్కొంటారు. ఈ మధ్య కాలంలో వీటిని దాదాపు 1.2 కోట్ల మంది వినియోగదారులు ప్లే స్టార్ నుండి డౌన్ లోడ్ చేసుకున్నారంటే అది ఎంత పెద్ద స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

ఇక 1.2 కోట్ల మంది ఈ తరహా యాప్లను డౌన్ లోడ్ చేసుకున్నారంటే వాటిని ఎంత మంది వాడి ఉంటారు, ఎంత మంది మోసపోయి ఉంటారు అనేది మన ఊహకి అందని అంశం.

ఈ మోసపూరిత యాప్లు ప్రజలను చాలా తేలికగా బురిడీ కొట్టిస్తాయి. మన అవసరాల నిమిత్తం ఇంటర్నెట్ వాడుకుంటూ ఉండగా అందులో ఈ యాడ్స్ రూపంలో దర్శనమిస్తాయి.

చాలా తక్కువ వడ్డీ రేటుకే ఋణం ఇస్తామని అందులో ఉంటుంది. బయట బ్యాంకులు సిహెహె వడ్డీ రేటు కన్నా తక్కువే చూపెడతారు మొదట్లో.

ఒక్కసారి యాప్ గనుక డౌన్లోడ్ చేసుకుని లోన్ తీసుకుందామని ప్రయత్నం మొదలు పెట్టక, ఎదో ఒక సాకు చెప్పి అకౌంట్ నంబర్ నుండి అన్ని పర్సనల్ వివరాలు సేకరిస్తారు.

మన బ్యాంకు అకౌంట్ డీటైల్స్ అన్ని తీసుకున్న తరువాత వారి నిజ స్వరూపాన్ని బయట పెడతారు. పర్సనల్ డేటాను ఆసరాగా తీసుకుని బెదిరింపులకు పాల్పడి అందిన కాడికి దోచుకుంటారు.

చదువుకున్న వారు అయ్యి ఉండి కూడా ఈ తరహా యాప్ ల చేతిలో ఎలా మోసపోతున్నారు అనే అనుమానం రావచ్చు, ఈ యాప్ లు తమని తాము ఒక చట్టబద్దమైన యాప్ లుగా చుపెట్టుకుంటాయి, పైగా వినియోగదారులకు వారిచ్చే ఆఫర్లను చూపెడుతూ ఊరిస్తాయి.

ఎప్పుడైతే ఆ ఆఫర్లకు ఆకార్షితులవుతారో అప్పుడే వారు మోసపోయినట్టు లెక్క వేసుకోవాలి. యాప్ లో చూపించిన వివిధ ఆఫర్లు లోన్లు పొందాలంటే ముందుగా అప్లికేషన్ పూర్తి చేయాలనీ చెబుతారు,

అక్కడే మొదటి మోసం మొదలవుతుంది. అప్లికేషన్ పూర్తిచేయించే నెపంతో అన్ని వివరాలు లాగేస్తారు. ఆర్ధిక పరమైన లావాదేవీలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు.

కాబట్టి ఆండ్రాయిడ్ మొబైల్ అలాగే స్మార్ట్ ఫోన్ వాడేవారు ఏ యాప్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు, ఇప్పటికీ ఎవరైనా అటువంటి యాప్లను ఇన్ స్టాల్ చేసుకుని ఉంటె వాటిని వెంటనే డిలీట్ చేయాలనీ అంటున్నారు.

Leave a Comment