ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ ..:
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వరుసగా రాజకీయ నాయకుల పై ఈడీ దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై కూడా ఈడీ అధికారులు దాడి చేశారు.
గురువారం సర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ నివాసంలో సోదాలు మొదలుపెట్టిన ఈడీ అధికారులు, అక్కడ ఆయన స్టేట్మెంట్ ను తీసుకొని మొత్తం రికార్డు చేశారు. ఇక ఆ తరువాత దాదాపు రెండు గంటలపాటు కేజ్రీవాల్ నీ విచారించి అనంతరం ఆయనని అరెస్ట్ చేశారు.
ఇక తరువాతి రోజు అవెన్యూ కోర్టులో హాజరుచేసేందుకు సిద్దమవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కి మద్దతు తెలుపుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్దా సంఖ్యలో ఆంధోళన చేపట్టారు.
అరెస్ట్ చేసినా, జైలు నుంచే పరిపాలన :
ఈడీ అధికారులు తమ బలగలతో ముఖ్యమంత్రి నివాసానికి సోదాలకోసం వచ్చినప్పుడే ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈడీ అధికారులు సోదాలకోసం రాలేదని, అరెస్ట్ చేయడమే వారి ఉద్దేశమని అరెస్ట్ కి ముందే ఊహించి చెప్పారు.
ఒకవేళ ఆయనని అరెస్ట్ చేసిన కూడా జైలు నుంచే పరిపాలన సాగుతుందని, ఎట్టి పరిస్థితులలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయరని స్పష్టం చేశారు. ఇక ఆయన అరెస్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కుట్ర అంటూ వ్యాఖ్యానించారు.
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పందన :
ఇక కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో పలు రాజకీయ నాయకులు పలు రకాలుగా స్పందించారు. ఇక ఈ విషయంలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ పూర్తిగా అక్రమం అని అన్నారు.
సరిగ్గా ఎన్నికల ముందే అరెస్ట్ చేయడం వెనక భారీ కుట్రే ఉందని ఆరోపించాడు.
ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ, కేజ్రీవాల్ కి ఎన్నో కోట్ల మంది ప్రజల ఆశీర్వాదలు ఉన్నాయని, ఆయనని తాకడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు.
కేటీఆర్ స్పందన:
కేజ్రీవాల్ అరెస్ట్ పై తాజాగా మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. ఈ అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, అక్రమంగా ఆయనని అరెస్టు చేశారని అన్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వ అణచివేతకు ఈడీ, సీబీఐలు సహకరిస్తున్నాయని అన్నారు.
రాజకీయంగా ప్రత్యర్థి స్థానంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ టార్గెట్ గా చేసి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
ఇక అచ్చం ఇలాగే కేటీఆర్ చెల్లెలు, BRS ఎమ్మెల్సీ కవితని కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆప్ నేత మంత్రి అతిషి స్పందన :
కేజ్రీవాల్ అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఎన్నికల్లో పోటీ చేసి చూపించాలని, అంతే కానీ ఈ ఈడీని అడ్డం పెట్టుకొని ఇటువంటి చర్యలకు పాల్పడటం సరైనది కాదని అన్నారు.