Youtuber Chandu Sai: అరెస్ట్ అయిన “పక్కింటి కుర్రాడు”

Arrested "boy next door"

Youtuber Chandu Sai: అరెస్ట్ అయిన “పక్కింటి కుర్రాడు”

చంద్రశేఖర్… చందు సాయిగా, పక్కింటి కుర్రాడిగా ప్రజలకి బాగా పరిచయం ఉన్న ఫేమస్ యూట్యూబర్. ఇతను యూట్యూబ్ లో సమాజానికి ఉపయోగపడే కామెడీ వీడియొలు, ఎన్నో సందేశాత్మక వీడియొలు, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.

ఇటీవల యూట్యూబర్ చందు సాయి ఒక యువతిని ప్రేమ పేరుతో నమ్మించి, అత్యాచారం చేసి మోసం చేసిన ఆరోపణ తో అరెస్ట్ అయ్యాడు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు పైన చందు సాయిని విచారించి అరెస్ట్ చేసారు. అనంతరం అతన్ని రిమాండ్ కి తరలించారు.హైదరాబాద్, నార్సింగికి చెందిన యువతి పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, చందు సాయిని అరెస్టు చేశారు.

ఆ యువతిని ప్రేమించినట్టు నమ్మించాడని, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అనంతరం ఆమెను పట్టించుకోకుండా వదిలేశాడని, అప్పుడు మోసపోయినట్టు గ్రహించిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు చందు సాయి పైన రేప్, చీటింగ్, ఎస్సి, ఎస్టి అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
చంద్రశేఖర్ తో పాటు అతని తల్లిదండ్రులు, మరియు ఇంకో ఇద్దరి పైన బాదితురాలు ఫిర్యాధు చేసింది, దాంతో పోలీసులు వారి పైనా కేసు నమోదు చేసారు.

చందు సాయి ని అరెస్ట్ చేసి నార్సంగి కి రిమాండ్ కి తరలించారు పోలీసులు.యూట్యూబ్ లో మంచి గుర్తింపు పొందిన చందు సాయి, ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంటున్నాడు,

ఇంతలోనే ఇలాంటి ఆరోపణతో అరెస్ట్ అయ్యాడు.గోప్యత కోసం బాధితురాలి వివరాలు ఇంకా బయటకు తెలియలేదు.

Leave a Comment