SCR Special Trains For Sankranti: జీవనానోపాధి నిమిత్తం ఒక ఊరు నుండి మరో ఊరు వెళ్లి ఉద్యోగ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించేవారు అనేకమంది. అలంటి వారిలో మన తెలుగువారు ఎక్కువనే చెప్పాలి.
ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)తెలంగాణ(Telangana) రాష్ట్రాల మధ్య ఈ తరహా జనాభా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ నుండి అనేక మంది ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్(Hyderabad) లో ఉంటారు.
ఇలాంటి వారు ఏ సందర్భంలో సొంత ఊర్లకు వెళ్లినా వెళ్లకపోయినా పండుగల సమయాల్లో మాత్రం తప్పకుండ వెళుతుంటారు. ఆ సమయంలో హైదరాబాద్ ఎలా ఉంటుంది అంటే,
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అస్సలు రద్దీ అనేదే కనిపించదు, సినిమా టికెట్లు చాలా తేలికగా దొరుకుతాయి. ఎక్కడికి వెళ్లాలన్నా రోడ్లపై రయ్ మని వెళ్లిపోవచ్చు. అలంటి సందర్భాన్ని మనం కొద్దీ రోజుల్లో చూడబోతున్నాం. అదే సంక్రాంతి సీజన్.
SCR to Run 32 Sankranti Special Trains @drmvijayawada @drmgnt @drmhyb @drmsecunderabad pic.twitter.com/IDex9T5iPf
— South Central Railway (@SCRailwayIndia) January 2, 2024
రద్దీ ని దృష్టిలో పెట్టుకుని : Considering the Floating
జనవరి ఏడవ తేదీ నుండే సంక్రాంతి హడావుడి మొదలైపోతుంది. సొంత ఊళ్ళకి వెళ్లేవారితో బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లు (Rialway Sations)కిటకిటలాడిపోతుంటాయి.
Click https://www.irctc.co.in/nget/train-search for complete train information
కాబట్టి ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ(Railway Department) ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
ఈ రైళ్లలో ఏసీ(AC), స్లీపర్(Sleeper), జనరల్(General) బోగీలు ఉంటాయి. వీటిని జనవరి ఏడవ తేదీ నుండి జనవరి 27వ తేదీ వరకు నడపనున్నారు.
సాధారణంగా దూరప్రయాణాలు చేయాలనుకునే వారు బస్ ప్రయాణం(Bus Journey) కన్నా రైలు ప్రయాణాన్నే ఎన్నుకుంటారు.
టికెట్టు ధర తక్కువగా ఉండటం ఒకటైతే కాస్త త్వరగా కూడా వెళ్ళడానికి వీలుంటుంది. అందులోను కాస్త ముందుగా రిజర్వేషన్ గనుక చేసుకుంటే హాయిగా స్లీపర్ క్లాస్ లో పడుకుని ప్రయాణం చేయొచ్చు.
ప్రతుతం దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని ఏయే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతుంది అనేది ఒక్కసారి చూద్దాం.
శ్రీకాకుళం(Srikakulam)-వికారాబాద్(Vikarabad), సికింద్రాబాద్(Secundrabad)-కాకినాడ టౌన్(Kakinada Town), సికింద్రాబాద్-బ్రహ్మపుర్(Bramhapur), విశాఖపట్నం(Visakhapatnam)-కర్నూలు సిటీ(Karnul City), సికింద్రాబాద్-తిరుపతి(Tirupathi), సికింద్రాబాద్-నర్సాపూర్, బ్రహ్మపుర్-వికారాబాద్ లైన్లలో ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఇక ఈ రైళ్ల నడిచే తేదీలు చుస్తే..
- రైలు నెంబర్ 07090 బ్రహ్మాపుర్ – వికారాబాద్ – జనవరి 8, 15
- రైలు నెంబర్ 07091 వికారాబాద్ – బ్రహ్మపుర్ – జనవరి 9, 16
- రైలు నెంబర్ 07092 బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ – జనవరి 10, 17
- రైలు నెంబర్ 08541 విశాఖపట్నం – కర్నూలు సిటీ – జనవరి 10, 17, 24
- రైలు నెంబర్ 08542 కర్నూల్ సిటీ – విశాఖపట్నం – జనవరి 11, 18, 25
- రైలు నెంబర్ 08547శ్రీకాకుళం – వికారాబాద్ – జనవరి 12, 19, 26
- రైలు నెంబర్ 08548 వికారాబాద్ – శ్రీకాకుళం – జనవరి 13, 20, 27
- రైలు నెంబర్ 02764 సికింద్రాబాద్ – తిరుపతి – జనవరి 10, 17
- రైలు నెంబర్ 02763 తిరుపతి – సికింద్రాబాద్ – జనవరి 11, 18
- రైలు నెంబర్ 07271 సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ – జనవరి 12
- ట్రైన్ నెంబర్ 07272 కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ – జనవరి 13
- రైలు నెంబర్ 07093సికింద్రాబాద్ – బ్రహ్మపుర్ – జనవరి 8, 15
- రైలు నెంబర్ 07094 బ్రహ్మాపుర్ – సికింద్రాబాద్ – జనవరి 9, 16
- ట్రైన్ నెంబర్ 07251 నర్సాపూర్ – సికింద్రాబాద్ – జనవరి 10