బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (sharukh Khan)హీరోగా తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ (Atlee)ప్రతిష్టాత్మకంగా తెరెక్కించిన మూవీ జవాన్ (Jawaan).గత ఏడాది థియేటర్లో రిలీజైన ఈ సినిమా బ్లాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. సుమారు రూ. 1100 కోట్ల వసూళ్లను సాధించింది ఈ మూవీ. ఈ సినిమాను షారుఖ్ బార్య గౌరీ ఖాన్ (Gouri Khan)రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్‌మెంట్స్ (Red Chillies entertainment)బ్యానర్ పై నిర్మించింది.
ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanathara) కనిపించాడుు. సౌత్ బ్యూటీ ప్రియమణి (Priyamani)లాంటి యాక్టర్లు కీలక పాత్రలను పోషించారు. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపిక పదుకొనే ( Deepika Padukone), సంజయ్ దత్ (Sanjay Dutt)గెస్ట్ రోల్స్ చేశారు. ఇక సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravi chandar)అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.
‘జవాన్’సీక్వెల్ ఉంటుందా? :
జవాన్(Jawaan)మూవీ రిలీజైనప్పటి నుంచి దీని సీక్వెల్ వస్తుందని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యంగ్ డైరెక్టర్ అట్లీ (Atlee)కూడా ఈసీక్వెల్ గురించి చాలా సార్లు మాట్లాడాడు. లేటెస్టుగా అట్లీ ఇచ్చిన హింట్ తో కచ్చితంగా ‘జవాన్‘ సీక్వెల్ ఉంటుందని జనాలకు క్లారిటీ వస్తోంది. ఓ ఇంటర్వ్యూలో జవాన్ సీక్వెల్ గురించి నేను ఏం చెప్పలేను, కానీ, కచ్చితంగా ఓ సర్ ప్రైజ్ తో మీ ముందుకు వస్తానని తెలిపాడు.
దీంతో సీక్వెల్ కు అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Sharukh Khan) తో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనతో కలిసి సినిమా చేయడం నా అదృష్టం. ఆయన చాలా జోవియల్ గా ఉంటారు. స్టార్ హీరో అయినా వర్క్ విషయానికి వస్తే టైమ్ మెయింటెనెన్స్ చేస్తారు. ఆయనతో కచ్చితంగా మరోసారి పని చేస్తాను. ఎప్పుడు? ఎలా? అనేది ఆయన చేతుల్లోనే ఉంది”. అని అట్లీ తెలిపాడు.
క్రేజీ ప్రాజెక్టులతో అట్లీ బిజీ :
అట్లీ (Atlee) ఇప్పుడు బాలీవుడ్ లో బాగా బిజీ అయ్యాడు. యంగ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)తో కలిసి ‘VD 18’ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. మురాద్ ఖేతానీ (Murad Khetani) డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో సౌత్ స్టార్ నటి కీర్తి సురేష్ (Keerthi Suresh)హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సౌత్ బ్యూటీ కూడా బాలీవుడ్లోకి అడుగు పెడుతుంది. అటు అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. బన్నీ బర్త్ డే రోజు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది.