బెంగళూరు లో ఆజాన్ సమయంలో హనుమాన్ చాలీసా చదివిన వ్యక్తి పై దాడి

Screenshot 2024 03 19 130552 బెంగళూరు లో ఆజాన్ సమయంలో హనుమాన్ చాలీసా చదివిన వ్యక్తి పై దాడి

నిన్న బెంగళూరు లో ఒక దుకాణం నడుపుకునే వ్యక్తి షాపు లో హనుమాన్ చాలీసా రావడం, అక్కడే ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆజాన్ వస్తుంది ఆపాలని చెప్పాడు. అయితే ఆ దుకాణం నడిపే ముఖేష్అనే వ్యక్తి వినకపోవడం తో అతనిని విచక్షణారహితం గా కొట్టడం జరిగింది. ఈ విషయం BJP ఎంపి తేజస్వి సూర్య కి తెలియడం తో ఆయన వచ్చి ఆ దుకాణ దారునితో మాట్లాడి సంఘీభావం తెలిపారు.

అనంతరం కొంత మంది BJP కార్యకర్తలతో ఈరోజు హనుమాన్ చాలీసా పఠిస్తూ జుమ్మా మసీదు రోడ్డు నుండి పలు వీధులు తిరుగుతూ హిందువులపై జరుగుతున్న దాడులు వ్యతిరేకించాలని అందుకు హిందువులు అందరు సహకరించాలని ఆయన కోరారు. ఈ నేపద్యంలో ఆ సమయం లో ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు తగిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు.

Leave a Comment