IPL Auction 2024: ఆస్ట్రేలియా ఆటగాళ్లకు అధిక రేటు..వేలంలో మనవాళ్ళా సత్తా ఎంతంటే.
2024 IPL మొదలవక ముందే ఈ ప్రీమియర్ లీగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం క్రికెట్ లవర్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. అందుకు కారణం IPL మినీ వేలం. ఈ మినీ వేలం, మెగా లీగ్‌లో రికార్డులు బ్రేక్ చేసేసింది. ముఖ్యంగా ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఆ దేశపు ఆటగాళ్లు మోస్ట్ వాంటెడ్ అవ్వడానికి కారణం కూడా లేకపోలేదు. మొన్నామధ్య ముగిసిన పురుషుల వన్డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా జట్టు ఎగరేసుకుపోవడమే మెయిన్ రీజన్. అందుకే ఆ టీమ్ లోని ప్లేయర్స్ మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ పై వేలం పాటలో నోట్ల కట్టల వర్షం కురిపించారు ఫ్రాంచైజీల వారు.
మొత్తానికి ఒకరిమీద ఒకరు పోటీపడి కోట్లు వెచ్చింది వారిని దక్కించుకున్నారు. ఇప్పటివరకు16 IPL సీజన్లు జరగ్గా అందులోని ఏ ఒక్క ఆటగాడికి కూడా ఈ స్థాయిలో డిమాండ్ కనిపించలేదు.
ఇప్పటివరకు ఉన్న 20 కోట్ల రూపాయల మార్కును ఈ ఇద్దరూ ఒకేసారి చెరిపేశారు. దుబాయ్‌లో వేదికగా నిర్వహించిన వేలంపాటలో ఈ ఇద్దరిని దక్కించుకోవడం కోసం కొన్ని ఫ్రాంచైజీలు హోరాహోరీగా తలపడ్డాయి.
అయితే ప్రస్టేజీకి పోయి ఇంత ధర పెట్టాయా లేదంటే సదరు ఆటగాళ్లు ఆ ధరకు నిజంగా అర్హులేనా అన్న విషయం మాత్రం సరిగ్గా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
IPL చరిత్రలోనే అత్యధిక ధరగా పేర్కొనబడిన ఈ సంఖ్యా కేవలం నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు తారుమారైంది.
Reason behind stark got huge rate in bidding:
ఈ IPL లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని చెప్పొచ్చు. మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆసీస్ కెప్టెన్ కమిన్స్‌ను 20.50 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది.
ఈ ధరతో కమిన్స్ ను కొనడం వల్ల లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్ జట్టు పేరు మీద ఉన్న రికార్డ్ బ్రేక్ అయింది. ఎందుకంటే గత ఐపీఎల్ కోసం ఆ పంజాబ్ కింగ్స్ ఏకంగా 18.50 కోట్ల రూపాయలు పెట్టి సామ్ కరన్ ను అత్యధిక ధరకు కొనుగోలు చేసింది.
అయితే కేవలం కొద్దీ నిమిషాల వ్యవధిలో కోల్‌కతా నైట్ రైడర్స్ బిడ్డింగ్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి స్టార్క్ ను దక్కించుకుంది.
అతడిని ఏకంగా 24.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి అందరిని నిర్ఘాంత పరిచింది. అయితే స్టార్క్ మాత్రం ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి రావడం రావడంతోనే వావ్ అనిపించాడు.
ఈ మెగా టోర్నీ హిస్టరీలో ఇప్పుడప్పుడే చెరిగిపోని విధంగా తన పేరుమీద ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. అత్యంత విలువైన క్రికెటర్‌గా చరిత్ర పుటలకెక్కాడు.
Reason behind the players cost so much:
ఒకటి కాదు రెండు కాదు, ఐదు కాదు పది కాదు, దగ్గర దగ్గరగా పాతిక కోట్లు కుమ్మరించి ఈ ఆటగాళ్లనీ కొనుగోలు చేయడం అవసరమా అని చేసేవారిని అనిపించక మానదు,
అయితే అందుకు ఫంచైజీలకు మాత్రం అంత డబ్బు వారి నెత్తిమీద పెట్టి కొనడానికి కొన్ని బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. పురుషుల వన్డే వరల్డ్‌లోనే ఈ ఆటగాళ్లు టాప్ పేసర్లు కావడం ప్రధాన కారణం అయితే, రెండవది వీరికి ఆటలో చాలా ఉండటం.
అందుకే ఈ ఫ్రాంచైజీలు స్టార్క్, కమిన్స్ వంటి ప్లేయర్స్ ను దక్కించుకోవడం కోసం అంతలా తాపత్రయ పడ్డాయి. ఇక ఇదే టైం లో సన్ రైజర్స్, కోల్‌కతా, గుజరాత్ జట్లలో మెయిన్ ఫారిన్ పేసర్లు లేరు. అందుకే ఈ ఆటగాళ్ల రొట్టె విరిగి నేతిలో పడింది.
సన్ రైజర్స్ జట్టు మొదట కమిన్స్‌ను దక్కిచుకుంది దీంతో మిగిలిఉన్న స్టార్క్ రేట్ కి రెక్కలొచ్చాయి. అతడిని ఎలాగైనా దక్కిచుకోవాలి అని కేకేఆర్,
గుజరాత్ జట్లు ఎక్కడ వెనక్కి తగ్గకపోవడంతో అతనికి రికార్డ్ స్థాయి రేటు దక్కింది. అయితే స్టార్క్ పై అంత రేటు పెట్టడం తప్పు అని కూడా చెప్పలేం, ఎందుకంటే స్టార్క్ గతంలో ఆడింది రెండే రెండు సీజన్లు కానీ అందులో అతను 27 మ్యాచ్ లు ఆడి 34 వికెట్లు తీశాడు.
Wow IPL franchise owners spent 230 crores:
ఇక వేలంపాట మొత్తాన్ని గనుక ఒక్కసారి గమనిస్తే పది ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొన్నాయి, ఈ ఫంచైజీలూ 30 మంది ఫారిన్ ఆటగాళ్లతో కలుపుకుని
మొత్తం 72 ప్లేయర్స్ ను కొనుగోలు చేశాయి. ఈ వేలంలో 72 మంది ఆటగాళ్ల మీద ఫ్రాంచైజీలు పెట్టిన మొత్తం సొమ్ము 230.45 కోట్ల రూపాయలు అని తెలిస్తే ఆశ్చర్యపోకమన్నారు.
Indian players in auction:
ఈ వేలంపాటలో కేవలం ఫారిన్ ప్లేయర్లు అత్యధిక రేటుకి అమ్ముడు పోయారు అని మాత్రమే ఇప్పటివరకు చెప్పుకున్నాం కానీ మన భారత ఆటగాళ్లు కూడా తక్కువేం తినలేదు,
వేలంలో ఫ్రాంచైజీలు మన వారిపై కూడా బాగానే డబ్బు పెట్టాయి. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన యువ ఆటగాడి గురించి ముందుగా చెప్పుకుందాం, సమీర్ రిజ్వీ అనే ఈ ప్లేయర్ ను చెన్నై సూపర్ కింగ్స్, 8.4 కోట్ల రూపాయలకు కొనేసింది.
రిజ్వీ వయసు 20 సంవత్సరాలు మాత్రేమే ఈ మధ్య టి 20 తో రిజ్వి లైం లైట్ లోకి వచ్చాడు. బంతిని బావున్దరీలు దాటించడంలో వీరుడే.
మరోవైపు పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన షారూక్ ఖాన్ అనే ఆటగాడిని గుజరాత్ టైటాన్స్ 7.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కుమార్ కుశాగ్ర అనే జార్ఖండ్ బ్యాట్స్ మెన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం 7.2 కోట్ల కు దక్కించుకుంది.
ఇతని కోసం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ కుడా పోటీ పడ్డాయంటే అతని డిమాండ్ అర్ధం చేసుకోవచ్చు. ఇక యశ్ దయాల్ ను ఆర్సీబి 5 కోట్లను పెట్టి కొనుక్కుంది, మరో ఆటగాడు శివం మావి లక్నో జట్టు 6.4 కోట్ల రూపాయలకు తీసుకుంది.