Auto Drivers Reaction On Free Bus Service : మహిళలకు ఉచిత బస్ స్కీమ్ పైన ఆటో డ్రైవర్ల నిరసన.
తెలంగాణ కొత్త ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి మహిళలకు ఉచిత బస్ అనే సర్వీసు మిశ్రమ ఫలితాల్ని పొందుతుంది.
తెలంగాణలోని ఆడబిడ్డలు ఈ మార్పు ని ఎంతో ఆనందంగా స్వీకరిస్తే, తెలంగాణలోని ఆటో డ్రైవర్లు మాత్రం దీన్ని ఒక శాపంగా భావిస్తున్నారు.
రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించే ఆటో డ్రైవర్లు, ఇప్పడు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
ఇక చాలా ప్రదేశాల నుంచి ఇప్పటికే చాలా వ్యతిరేఖత వస్తుంది. కొన్ని ప్రదేశాలలో రిక్షా డ్రైవర్లు నిరసన తెలుపుతూ ర్యాలీలు దీక్షలు చేస్తున్నారు. ఈ పథకం తమ ఆదాయానికి గొడ్డలి పెట్టులా మారిందని, వెంటనే దీన్ని రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నారు.
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెంలో వారు నిరసన చేపట్టారు.వాళ్ళు వల్ల కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారని, పిల్లల్ని చదివించలేకపోతున్నారని,వారి జీవనోపాధి అంతా దెబ్బ తింటోందని వాపోతున్నారు.
ఎలాంటి పరిమితులు లేకుండా అన్నీ బస్సులకి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం వారు ఊహించలేదని, ఇది వారి కుటుంబాల్ని రోడ్డు మీదకి తీసుకొస్తుందని బాద పడుతున్నారు.
ఈ పతకంలో మార్పులు చేయాలని లేదంటే మొత్తానికే తొలగించాలని సిఎం రేవంత్ రెడ్డి ని కలవడానికి ప్రజాదర్భర్ కి వెళ్ళి వాళ్ళ బాదలు మొరపెట్టుకుంటున్నారు.