Ayodhya Mandir: యోధ్య గర్భ గుడి మొదటి బంగారు తలుపు.

Yodhya Garbha Temple is the first golden door.


Ayodhya Mandir: దేశ వ్యాప్తంగా ఎంతో మంది వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న తరుణం సమీపిస్తోంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అయోధ్య‌లో(Ayodhya) చేప‌ట్టిన రామ‌మందిరానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. మందిర నిర్మాణం దాదాపుగా పూర్తయిందనే చెప్పొచ్చు.

ఇక అతిరథమహారధులు ముఖ్య అతిధులుగా హాజరవగా ఈ నెల 22వ తేదీన రామజన్మభూమి అయిన అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించ‌న‌నున్నారు.

అందుకు తగిన ఏర్పాట్లు కూడా చకచకా పూర్తవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక ముఖ్యమైన ఘట్టం జనవరి 10వతేదీన పూర్తయింది.

అదేమిటంటే రామ‌మందిరానికి గ‌ర్భ‌గుడిలోని మొద‌టి బంగారు త‌లుపును(First Golden Door) ఏర్పాటు చేశారు.

గర్భగుడి పై అంతస్తులో 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న బంగారు త‌లుపును అమ‌ర్చ‌డం డివిజయంగా పూర్తిచేశారు.

ఇక రానున్న మూడు రోజుల్లో ఆలయంలో మరో 13 బంగారు తలుపులు అమర్చనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi) పేర్కొన్నారు.

మొత్తం 42 తలుపులు – Total 42 Doors

దశరధ నందనుడైన శ్రీ‌రాముని ఆల‌యంలో మొత్తం 46 త‌లుపులు ఉండనున్నాయి. వాటన్నిటిని కూడా వీలైనంత త్వరగానే అమర్చనున్నారు.

ఎందుకంటే రామమందిర ప్రారంభోత్సవానికి ఎక్కువ సమయం అయితే లేదు. ఇక ఈ 42 త‌లుపుల‌కు కూడా బంగారు తాపడం ఉందనున్నట్టు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య మంత్రి కార్యాల‌యం

(Uttar Pradesh CMO Office) ఒక ప్రకటన ద్వారా పేర్కొంది. జ‌న‌వ‌రి 22వ తేదీన రామ‌మందిర ప్రారంభోత్స‌వ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని జనవరి 10వతేదీ నుండే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠ‌శాల‌లు,

క‌ళాశాల‌ల‌కు ముఖ్య మంత్రి యోగి సెల‌వులు ప్ర‌క‌టించేశారు. కేవలం పాఠశాలలకు సెలవు ఇవ్వడం మాత్రమే కాదు, మందిర ప్రారంభోత్సవ రోజైన జనవరి 22వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా మద్యం(No Alcohol Day) అమ్మకాలను నిలిపివేయనున్నారు.

అయోధ్యలో కుంభ్ మోడల్ అమలు – Implementation of Kumbh model in Ayodhya

ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుతూ ఇప్పటికే అనేకమంది రాజకీయ(Political), సినీ(Movie) ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరితోపాటు పారిశ్రామికవేత్తలు

(BusinessMen), క్రికెటర్లు(Criketers) ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. ఇక రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య అంతటా శుభ్రత పాటించాలని సూచించారు

సీఎం యోగి(CM Yogi), అందుకు గాను కుంభ్ మోడల్(Kumbh Model) ను అమలు చేయాలనీ అధికార్లకు హుకుం జారీ చేశారు.

ఇక ఆలయాన్ని ప్రారంభోత్సవం నాటికీ విద్యుత్ కాంతులతో ధగద్ధగాయమానంగా, దేదీప్యంగా వెలిగిపోయేలా, విద్యుత్ దీపాలతో అలకరిస్తారట.

Leave a Comment