ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం :
Ayodhya Prasad fraud on Amazon: ఈ నెల 22న అయోధ్య లో జరిగే శ్రీరామ ప్రాణప్రతిష్టాపన గురించి దేశం అంతా ఎదురు చూస్తుంది.
ప్రధాని నరేంద్ర మోది ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు.
దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల నుంచి అయోధ్య రాముడికి కానుకలు పంపిస్తున్నారు.
అమెజాన్ లో రామమందిర ప్రసాదం విక్రయం :
కొంతమంది వ్యాపారస్తులు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
అమెజాన్ లో రామమందిర ప్రసాదం అంటూ, ” రఘుపతి ఘీ లడ్డు “, ” అయోధ్య రామ్ మందిర ప్రసాదం ” , ” ఖోయా ఖోభి లడ్డు “,
” రామ్ మందిర్ అయోధ్య ప్రసాదం ” అని రకరకాల పేర్లతో కొంతమంది వ్యాపారస్తులు సేల్స్ చేస్తున్నారు.
సీసీపీఏ నుంచి నోటీసులు:
అమెజాన్ లో కొంతమంది వ్యాపారస్తులు చేసే మోసాలు తమ దృష్టి వరకు రావడంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అమెజాన్ కి నోటీసులు పంపించింది.
వారం రోజుల లోగా స్పందించకపోతే వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.
అమెజాన్ స్పందన :
సీసీపీఏ నోటీసులకు అమెజాన్ వెంటనే స్పందించింది. ఆ వ్యాపారస్తుల సేల్స్ ఆప్షన్ ని వెంటనే తొలగించింది.
ఆ సెల్లర్లపై తమ విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు.