Ayodhya Ram lalla First Look: రాం లల్లా విగ్రహాన్ని చూశారా బాలరాముడు ఎలా ఉన్నాడో చుడండి

website 6tvnews template 47 Ayodhya Ram lalla First Look: రాం లల్లా విగ్రహాన్ని చూశారా బాలరాముడు ఎలా ఉన్నాడో చుడండి

Ayodhya Ram lalla First Look: అయోధ్య లో కొలుదీరాబోయే రఘు నందనుడు ఎలా ఎలా ఉంటాడా అని అంతా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆలా ఎదురు చూసే వారి ఆతృతను తెరదించింది రామ తీర్ధ క్షేత్ర ట్రస్ట్(Rama teerdha Kshetra Trust).

రామ మందిర గర్భగుడిలో కొలువుదీరనున్న బాల రాముడి విగ్రహా రూపాన్ని బహిర్గతం చేశారు. ఎప్పుడైతే శ్రీరామ చంద్రుడి విగ్రహ రూపాన్ని ఆవిష్కరించారో అది క్షణాల్లో వైరల్ గా మారింది.

సామజిక మాధ్యమాల ద్వారా ఒకరికి ఒకరు ఆ రూపాని షేర్ చేసుకుని తరిస్తున్నారు. (Ayodya Rama First Look)ఇప్పటివరకు చేతులకు తెల్ల వస్త్రం, ముఖానికి పసుపు వస్త్రం చుట్టి ఉంచగా వాటిని పూర్తిగా తొలగించారు. కాబట్టి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకునే వీలు కలిగింది భక్తులకు.

అనుకున్న సమయానికన్నా ముందే దర్శనమిచ్చిన రామయ్య:

Ram Lead Ayodhya Ram lalla First Look: రాం లల్లా విగ్రహాన్ని చూశారా బాలరాముడు ఎలా ఉన్నాడో చుడండి


అయోధ్య రామయ్యను ప్రాణ ప్రతిష్ట రోజే చూడాలేమో అనుకున్నారు భక్తులు, అప్పటివరకు వేచి ఉండాలని కూడా ఫిక్స్ అయ్యారు.

కానీ అనుకున్న సమయం కన్నా ముందే విగ్రహ దర్శనం కలగడంతో మిక్కిలి సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారు. ఐదేళ్ల రాముడి విగ్రహం బంగారు విల్లు, బాణం పట్టుకున్నట్టు ఉంటుంది. దీనిని మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) రూపొందించారు.

గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చిన సమయంలో జై శ్రీరామ్ అనే నినాదాలు మారుమ్రోగాయి.(Ayodhya Rama First Look) ప్రస్తుతం గర్భ గుడిలోకి చేరుకున్న ఈ విగ్రహానికి జనవరి 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేయబడుతుంది.

అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ రోజు ఎక్కువ మందిని గర్భ గుడిలోకి అనుమతించరు. ఇప్పటికే అయోధ్య ఉత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని రాష్ట్రాలు జనవరి 22వ తేదీన సెలవును ప్రకటించాయి.

Leave a Comment