Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం పాన్ ఇండియా టెంపుల్.

website 6tvnews template 68 Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం పాన్ ఇండియా టెంపుల్.

Ayodhya Ram Mandir : శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం, సీతాపతిం, రఘుకులాన్వయ రత్నదీపం, ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం, నిశాచర వినాశకరం నమామి.

ఈ ఒక్క శ్లోకం చాలేమో రఘునందనుడు, పితృవాక్య పరిపాలకు, ఏకపత్నీవ్రతుడు, సత్యసంధుడు అయిన రాముడి గొప్పదనాన్ని వివరించి వర్ణించడానికి.

మరి అటువంటి అయోధ్యాపతి కి ఆలయం నిర్మిస్తున్నారంటే దానికి కూడా కొన్ని విశిష్టతలు ఉండితీరాలి కదా మరి అవేంటో చూద్దాం.

అయోధ్య మందిరం పూర్తి విస్తీర్ణం : Ayodhya Ram Mandir full area

GETKUVSb0AAhG4T Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం పాన్ ఇండియా టెంపుల్.

అయోధ్య రామ మందిర పూర్తి విస్తీర్ణం 70 ఎకరాలు. అయితే అందులో ఆలయ విస్తీర్ణం 2.77 ఎకరాలు, ఆలయ నిర్మాణ విస్తీర్ణం 57,400 చదరపు అడుగులు.

మిగిలినదంతా గ్రీన్ అరియాగా ఉంటుంది. ఆ ప్రతమంతా ఎల్లపుడు పచ్చడంతో పరిఢవిల్లుతూ ఉంటుంది.

ఈ ఆలయం ఎన్ని ఏళ్ళ వరకు ఉంటుందంటే: Ayodhya Ram Mandir will last how many years?

ఈ ఆలయాన్ని ఆషామాషీగా నిర్మించలేదు, దీని నిర్మాణంలో ఎక్కడ ఇనుము కలప వంటివాటిని ఉపయోగించలేదు.

ఇది రిక్టర్ స్కేల్ పై 10 తీవ్రత తో భూకంపం వచ్చినా నిబ్బరంగా నిలబడి ఉంటుంది. అందుకే ఇది 2 వేల సంవత్సరాల వరకు నిలిచి ఉంటుందని అంటున్నారు.

ఆలయ విస్తీర్ణం చూద్దాం: Area of ​​the temple

Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం పాన్ ఇండియా టెంపుల్.

ఈ ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు, దీని నిర్మాణం కోసం సుమారు 22 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని వినియోగించారట.

గత 200 సంవత్సరాలలో పూర్తిగా రాయితో నిర్మాణ మైన దేవాలయం ఇదొక్కటే.

ఎన్ని ద్వారాలు, ఎన్ని స్థంబాలు :Gates And Pillars

ఈ ఆలయంలో మొత్తం ద్వారాలు 44, మొత్తం స్థంబాలు 392, దీనికోసం తెలంగాణ, కర్ణాటక నుండి 17 వేల గ్రానైట్ బ్లాకులను తెప్పించి వాడారు. అంతేకాదు రామనామం లిఖించిన ఇటుకలనే వినియోగించారు.

చుట్టు ప్రాకారమ్ము సొంపుగా కట్టించి : Compound Wall

ఈ ఆలయ ప్రాకారం గురించి విశేషంగా చెప్పుకోవాలి, ఆలయ ప్రహరీ పొడవు 732 మీటర్లు, వెడల్పు 14 మీటర్లు ఉంటుంది. ఈ ప్రహరీ మనకు దీర్ఘ చతురస్రాకారంలో కనిపిస్తుంది.

ఇసుకను తవ్వి ఏమి పోశారో తెలుసా :

GETKVTXaQAAPQnU Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం పాన్ ఇండియా టెంపుల్.

ఆలయ నిర్మాణం కోసం ఎంపిక చేసిన భూమి కింద ఇసుక ఉంది, అది నిర్మాణానికి యోగ్యం కాదని భావించి, రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్(Rold Compact Concrete) ను అందులో పోశారు, ఆ కాంక్రీట్ కొన్నాళ్ళకి రాయిలా మారిపోతుంది. దానిపై నిర్మాణం చేపడితే అత్యంత దృఢంగా ఉంటుంది.

ఇటుకలూ ప్రత్యేకమే : Bricks Are Different

రాముడు లంక lanka కి వెళ్లి రావణుడితో యుద్ధం చేసి సీతను తీసుకురావడానికి సముద్రం పై వారధి నిర్మించారు, దానికోసం రాళ్లపై శ్రీరామ అని రాస్తే అవి నీటిపై తెలియాడాయి, ఆ ప్రేరణతోనే అయోధ్య ఆలయ నిర్మాణం కోసం వాడే ఇటుకలపై శ్రీరామ అని లిఖించారు.

రాముని విగ్రహం : Lord Rama Idol

అయోధ్యలో రామ మందిరాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించారు అని చెప్పాలి, ఎన్ని పరిశోధనలు, పరిశీలనలు చేసి ఆలయ నిర్మాణం చేపట్టారు.

అలాంటిది అందులో ప్రతిష్టించే విగ్రహం విషయంలో ఎంతటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అని వివరంగా చెప్పాలా ? ఈ విగ్రహం ఎలా ఉండాలి అనేదాని కోసం ముంబై Bombay కి చెందిన కళాకారుడు వసుదేవ్ కామత్ Vasudev kamath బాల రాముడికి సంబంధించిన స్కెచ్ వేశారు. దాని ఆధారంగానే విగ్రహం రూపుదిద్దుకుంది.

చెక్కిన వారు ధన్యులే :

GETKV2obQAAsoVf Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం పాన్ ఇండియా టెంపుల్.

రామ మందిర నిర్మాణం ఒక ఎత్తయితే రాముడి విగ్రహం మరో ఎత్తు, దానికి రూపాన్నిచ్చే శిల్పులు దేశవ్యాప్తంగా వేళా సంఖ్యలో ఉన్నప్పటికీ ఆ అవకాశం కర్ణాటక రాష్ట్రానికి చెందిన అరుణ్ యోగిరాజ్ Arun Yogi Raj కే దక్కింది. పైగా అరుణ్ యోగి రాజ్ వయసు కూడా ఎక్కువేం కాదు 41 మాత్రమే.

ఇక్కడ గంట కూడా ప్రత్యేకమే :

మనం గుడికి వెళ్ళగానే చేసేది దేవుడిని మేల్కొలపడానికి గంట కొట్టడం. మరి భారీ స్థాయిలో రూపుదిద్దుకున్న అయోధ్య రామ మందిరంలో సాదాసీదా గంటను తగిలిస్తే ఎం ఉంటుంది, అందుకే అక్కడ బాహుబలి గంటను తగిలించారు. ఆ జేగంట బరువు 620 కిలోలు ఇది తమిళనాడు Tamil Nadu రాష్ట్రం రామేశ్వరం(Rameswaram) లో తయారు చేయబడింది.

ఇక ఈ జేగంటతో పాటు మరికొన్ని గంటలు ఉన్నాయి అవి మొత్తం 42, వాటి బరువు 1200 కిలోలు అవి కూడా తమిళనాడులోనే తయారయ్యాయి, కాకుంటే వీటిని నమ్మక్కల్ Namakkal జిల్లాలో తయారు చేసారు.

తలపాగా తాంబూలం :

అయోధ్య రామ మందిరానికి అత్తవారి ఇంటి నుండి తలపాగా తాంబూలం వచ్చాయి, అత్తవారిల్లు అంటే మిథిలా నగరం, ఈ మిథిలా ఇప్పుడు బీహార్(Bihar) లో ఉంది, కాబట్టి బీహార్ వాసులు అల్లుడుగారికి మర్యాదపూర్వకంగా తాంబూలం, తలపాగా పంపించారు.

తల్లి ఇంటి నుండి ప్రసాదం :

GETKUVSb0AAhG4T 1 Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం పాన్ ఇండియా టెంపుల్.

రాముడి పండుగకు తల్లి ఇంటి నుండి ప్రసాదం వస్తోంది, రాముడి తల్లి కౌసల్య(Kousalya), ఆమె పుట్టినిల్లు చాంద్ ఖురీ(Chandkhuri), ఈ ప్రాంతం ఇప్పుడు ఛత్తీస్ ఘడ్(Chattisghad) లో ఉంది అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం 300 టన్నుల బాసుమతి బియ్యాన్ని పంపిస్తోంది, ఆ బియ్యంతోనే ప్రాణప్రతిష్ట నాడు ప్రసాదాన్ని తయారు చేస్తారు,

హైదరాబాద్ నుండి : From Hyderabad

రామ మందిర ప్రారంభం లోను అలాగే నిర్మాణం లో కూడా మన భాగ్య నగరం భాగం పంచుకుంటోంది. శ్రీరాముడి పాదుకలను మన హైదరాబాద్ (Hydearabad) కి చెందిన లోహ శిల్పులు రూపొందించారు, వీటి బరువు 12 కిలోల 800 గ్రాములు, ఈ పాదుకలు పంచలోహాలతో తయారు చేయబడ్డాయి, వందయేళ్ల పైనే ఇవి మన్నుతాయని అంటున్నారు.

వీటిని శ్రీమద్ విరాట్ కళాకుటీర్(Srimad Virat Kala Kuteer) లో రామలింగాచారి అయన బృందం తయారు చేసినట్టు తెలుస్తోంది. ఆలయ ప్రధాన ద్వారాలను హైదరాబాద్ కి చెందిన అనురాధా టింబర్ డిపో వారు తయారు చేశారు.

గర్భగుడి తలుపులు :

ఇక గర్భగుడి తలుపుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవి మహారాష్ట్ర(Maharashtra)లోని బలార్షా(Balarsha) నుండి తెచ్చిన టేకు తో తయారు చేశారు. ఈ తలుపుల 12 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉంటాయి. బలార్షా టేకు(Take Wood) కి మంచి డిమాండ్ ఉంది, అక్కడి టేకు కలప కి మన్నిక ఎక్కువ అని అంటారు.

ఆలయ రంగు, పార్లమెంట్ రంగు :Temple colour parliament colour

అయోధ్యలో రామ మందిరం రంగు, మనదేశ పార్లమెంటు భవనం(parliament colour) రంగు రెండు కూడా ఒక్కటే, అవి గులాబీ రంగులో ఉంటాయి. అందుకు కారణం రామ మందిరాన్ని రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం బన్సీ పహార్ పూర్ గులాబీ సున్నపు రాయిని వాడారు. ఈ పింక్ స్టాండ్ స్టోన్(Pink Stand Stone) కి మన దేశంలో ఎంతో డిమాండ్ ఉంది.

Leave a Comment