Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయానికి నిఘా పెంచిన భద్రతా బలగాలు. ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని.
అయోధ్య లో రామ మందిర నిర్మాణ చేపట్టాలన్న మాటకు కార్య రూపం దాల్చుకుంటోంది. 2020 ఆగస్టు 5 వ తేదీన అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
2024 జనవరి 22 వ తేదీకి రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేయాలనీ నిర్ణయించారు. అందుకు తగట్టుగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 14 వ తేదీన మకర సంక్రాతి తర్వాత రామ్‌లల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియ ప్రారంభించి 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది.
అదే విధంగా అయోధ్య రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని తెలుస్తోంది. ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు, ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు.
కేవలం మోదీ మాత్రమే కాక దేశ విదేశాల అనునది అనేక మంది ప్రముఖులు, స్వామీజీలు ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు.సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఉగ్రదాడుల హెచ్చరికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఇప్పటికే అయోధ్య రామాలయం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య రామాలయాన్ని భద్రతా బలగాలు డేగ కళ్ళతో కాపలా కాస్తున్నాయి.
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న అల్ ఖైదా, లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు భారీ ఉగ్ర దాడులు జరిపే అవకాశం ఉందని సెక్యూరిటీ ఏజెన్సీలకు ఇప్పటికే సమాచారం అందినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే రామమందిర నిర్మాణ పనుల గురించి కొన్ని వీడియోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ రామమందిరంలో శిల్ప కళాకారులు ఉలితో అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దుతున్నారు.
ఈ క్రమంలోనే రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ పనులు డిసెంబర్ నెల లోపు పూర్తికానున్నాయి.