అయోధ్య రామ మందిరం నుంచి కొత్త జంటకి స్పెషల్ సర్ ప్రైజ్

website 6tvnews template 2024 02 27T140750.289 అయోధ్య రామ మందిరం నుంచి కొత్త జంటకి స్పెషల్ సర్ ప్రైజ్

Ayodhya Ram Mandir sweet surprise to newly wed Rakul Preet Singh and Jackky Bhagnani : టాలీవుడ్‎లో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)కు మంచి క్రేజ్ ఉండేది. ఈ భామ ఫామ్ లో ఉన్నప్పుడే టాలీవుడ్ లోని స్టార్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకుని తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రిన్స్ మహేష్ బాబు(Mahesh Babu ), ఎన్టీఆర్ (NTR), రాంచరణ్(Ram Charan ) అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి టాప్ హీరోస్ సరసన నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది.

కానీ ఒక్కసారిగా అమ్మడి గ్రాఫ్ పడిపోయింది. దీంతో బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ పలు సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని(Jackky Bhagnani) ప్రేమలో పడింది.

సుమారు మూడేళ్ల లవ్ జర్నీ అనంతరం ఫిబ్రవరి 21 న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యింది . గోవా(Goa )లో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. రీసెంట్ గా రకుల్ సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు షేర్ చేసి తమకు పెళ్ళైన విషయాన్నీ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే నూతన జంటకు అయోధ్య (Ayodhya )రామ మందిరం నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ వచ్చింది. ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.

అయోధ్య ప్రసాదం రావడం అదృష్టంగా భావిస్తున్నా :

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తాజాగా తన ఇన్ స్టా స్టోరీస్ లో అయోధ్య (Ayodhya ) రామ మందిరం నుంచి ప్రసాదం వచ్చిందని పోస్ట్ పెట్టింది. ఓ ఫోటోను కూడా షేర్ చేసింది..” మా వివాహం అనంతరం అయోధ్య రాముని ఆలయం నుంచి ప్రసాదం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా మా లైఫ్ జర్నీ లో ఇదొక గొప్ప ప్రారంభం” అంటూ ఎమోషనల్ అయ్యింది రకుల్.

హనీమూన్ ఎక్కడంటే :

రకుల్‌ ప్రీత్ సింగ్(Ayodhya ), జాకీ భగ్నానీ(Jackky Bhagnani) లు హనీమూన్ (Honeymoon )కు ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి ఇండియాలో జరిగినా హనీమూన్ కోసం మాత్రం ఫారెన్ కు వెళ్లాలని అనుకుంటున్నారు.

అయితే ‘బడే మియా చోటే మియా’ (Bade Miyya Chote Miyya ) మూవీ విడుదలైన తర్వాతే వీరి హనీమూన్ ఉంటుందని ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అక్షయ్ కుమార్ (Akshay Kumar ), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff ) ఈ సినిమాలో నటించారు. ఈ ఏడాది ఈద్ కానుకగా థియేటర్స్ లో విడుదల కానుంది.

దీనితో ఈద్ తర్వాతే రకుల్, జాకీ హనీమూన్ ట్రిప్ కి వెళ్తారని తెలుస్తోంది. ఇక రకుల్ ప్రస్తుతం హిందీలో ‘మేరీ పత్నీ కా'(Meri Patni Kaa)రీమేక్‌లో నటిస్తోంది. తమిళంలో కమల్ హాసన్(Kamal Haasan )హీరోగా నటిస్తున్న ‘ఇండియన్‌ 2’ (Indian 2) సినిమాలో రకుల్ కనిపించనుంది. ఇక తెలుగులో రకుల్ చివరగా కొండ పొలం(Kondapolam )సినిమాలో కనిపించింది.

Leave a Comment