Key Features Of Ayodhya Mandir: జనవరి 22వ తేదీన దగ్గరపడుతున్న కొద్దీ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం గురించిన అనేక ఆశక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట ఈ ఆలయంలో తగిలించబోయే గంట గురించి,
ఆతరువాత ఆలయంలో ప్రతిష్టించబోయే శ్రీరామ చంద్రమూర్తి విగ్రహాల తయారీ గురించి తెలిసింది. ఎంతో ప్రతిష్ఠమకమైన ఈ ఆలయ నిర్మాణం మొదలుకొని ఆలయంలో ఉండే అనేక విశిష్టతల గురించి ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలకు తెలియజేస్తోంది ఆలయ ట్రస్ట్.
ఈ ట్రస్ట్ పేరు రామ తీర్ధ క్షేత్ర ట్రస్ట్. ఇక తాజాగా రామాలయానికి సంబంధించి మరో విషయం తెలియవచ్చింది. అదేమిటంటే ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదం.
సాధారణంగా దేవాలయానికి వెళ్ళిన సమయంలో భక్తులకు దేవుని ప్రసాదాన్ని అందిస్తారు. ముందు భావంతునికి నివేదించిన ఆ ప్రసాదమే భక్తులకు పంచిపెడతారు.
ఈ ప్రసాదం అనేది ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఉదాహరణకు లడ్డు అంటే తిరుపతి గుర్తుకువచ్చినట్టు.
ప్రసాదం అందించబోతోంది ఎవరంటే -Who is going to provide prasadam?
అయోధ్యలో(Ayodhya) నిర్మించిన రామాలయంలో భక్తులకు అందించబోయే ప్రసాదం ఏమిటై ఉంటుందా అని చాలామంది అనుకుంటున్నారు.
జనవరి 22 నుండి భక్తులకు దర్శమివ్వబోతున్న ఈ రామయ్య ఆలయానికి(Sri Rama Temple) వచ్చే భక్తులకు ఇలాచీ దానా ఇవ్వబోతున్నారు.
ఇలాచీ దానా(Ilachi Dana) అంటే యాలుకలతో(Cardamom) తయారు చేసే ప్రసాదం. ఈ ప్రసాదాన్ని తయారు చేసే అవకాశం రామ్ విలాస్ అండ్ సన్స్(Ram Vilas And Sons) దక్కించుకుంది.
ఆలయ ట్రస్ట్ కూడా ఎన్నో కంపెనీలు ఉన్నప్పటికీ రామ్ విలాస్ అండ్ సన్స్ కె ఈ అవకాశాన్ని ఇచ్చారు. జనవరి 22 వ తేదీ లోపు 5 లక్షల ప్రసాదం ప్యాకెట్లు తయారు గా ఉంచాలని వారు టార్గెట్ పెట్టుకున్నారట.
ఎందుకంటే ఆ తేదీన భక్తులు పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలి వస్తారని భావిస్తున్నారు. ఇక ఈ ప్రసాదం తినడం వల్ల భగవంతుని కృప తోపాటు ఆరోగ్యం కూడా లభిస్తుందని అంటున్నారు.
ఈ ఇలాచీ దానా తినడం వల్ల ఉదర సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. ఈ ప్రసాదం కేవలం అయోధ్య రామాలయంలో మాత్రమే కాకుండా దేశంలోని అనేక ఆలయాల్లో ఈ ప్రసాదాన్ని ఇస్తున్నట్టు వారు వివరించారు.
ఆలయ వైశాల్యం – Area of the temple
ఇక జనవరి 22వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేస్తారు.
పైగా అదే రోజున రాం లల్లా(Ram Lalla) విగ్రహాన్ని ప్రతిష్టించనున్నా. ఇక ఈ అయోధ్య రామాలయ విశిష్టతలు చాల ఉన్నాయి. మొదటగా చెప్పుకోవాలంటే ఇది నాగర్ శైలి సంప్రదాయంలో ఉంటుంది.
ఆలయం వైశాల్యం గురించి చెప్పాలంటే దీని పొడవు 380 అడుగులు(length 380 Feet), వెడల్పు 250 అడుగులు(width 250 Feet) అలాగే ఎత్తు 161 అడుగులు(height 161 feet).
ఈ ఆలయ నిర్మాణం మూడ్దతస్తులుగా జరిగింది. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. 44 తలుపులు ఉన్న ఈ ఆలయంలో 392 స్తంభాలు ఉంటాయి. ఇందులో నాలుగు మండపాలు ఉంటాయి,
అవి నృత్య మండపం, సభా మండపం, ప్రార్ధన మండపం, కీర్తన మండపం. అన్నిటికి మించి ఆలయ గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని మనం చూడొచ్చు.
ఆలయ విశిష్టతలు – Features of the Temple
ఈ ఆలయం చూడాలనుకునే దివ్యంగులు(Physically handycapped) వృద్దులు(Old Age people) నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఈ ఆలయంలో వీరిని దృష్టిలో పెట్టుకునే ర్యాంప్ లు(Ramp), లిఫ్ట్ లు(Lifts) ఏర్పాటుచేశారు. ఇక ఈ ప్రధాన ఆలయానికి నాలుగు మూలల్లో నాలుగు ఉప ఆలయాలు ఉంటాయి.
అవి విగ్నేశ్వరుడి ఆలయం(Ganesh temple), సూర్య భగవానుడి ఆలయం(Surya bhagavan temple), శివాలయం(Lord Shiva Temple), భగవతి దేవి(Bhagavathi Devi temple) ఆలయం.
ఇక ఆలయ సమీపంలో పురాతన బావి కూడా ఉంటుంది, దానినే సీతా కూప్ అని పిలుస్తారు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడ కూడా ఇనుమును ఉపయోగించలేదు.
ఆలయ పునాదులను 14 మీటర్ల రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్(Rollar Compact Concrete)_ తో నిర్మించారు. అంతే కాదు ఈ ఆలయంలో మురుగునీటి శుద్ధి, నీటి శుద్ధి కేంద్రాలు, అగ్నిమాపక కేంద్రం కూడా ఉన్నాయి.
ఈ మందిరాన్ని పూర్తిగా భారతీయ సంప్రదానికి అనుగుణంగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించారని తెలుస్తోంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే 70 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయంలో 70శతం పచ్చదనం ఉండేలా ఏర్పాటుచేశారు.