Baby heroine shocking decision: బేబీ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం..ఐటెమ్ సాంగ్‎ చేయనుందా?

Add a heading 2023 12 11T142848.128 Baby heroine shocking decision: బేబీ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం..ఐటెమ్ సాంగ్‎ చేయనుందా?

Baby heroine shocking decision: బేబీ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం..ఐటెమ్ సాంగ్‎ చేయనుందా?

వైష్ణవి చైతన్య తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఇది. సాయి రాజేష్ డైరెక్షన్‏లో వచ్చిన బేబి సినిమాలో ఈ భామ నటనకు అందరూ ఫిదా అయ్యారు.

చేసింది ఒక్కటే సినిమా అయినా సెన్సేషనల్ హిట్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. చిన్న సినిమాగా వచ్చిన బేబీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరూ ఊహించని భారీ వసూళ్లను రాబట్టింది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కిరాక్ యాక్టింగ్ తో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ మూవీతో ఒక్కసారిగా స్టార్డమ్ సాధించింది వైష్ణవి. ఏ హీరోయిన్ కి మొదటి సినిమాతో రాని పేరును సంపాదించుకుంది. దీంతో అమ్మడి పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్‎లో మారుమోగిపోయింది.

హైదరాబాద్ పాత బస్తీకి చెందిన వైష్ణవి యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. నటన మీద ఆసక్తితో షార్ట్ ఫిల్మ్‌ల్లో యాక్ట్ చేస్తూ వచ్చింది. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.

టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. యూత్‌లోనూ వైష్ణవికి మంచి క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్ ను గుర్తించే సాయి రాజేష్ బేబీ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు.

అయితే వైష్ణవికి బేబీ మూవీ కంటే ముందే ఓ సినిమాలో నటించింది. మొదటిసారిగా డైరెక్టర్ త్రివిక్రమ్ పుణ్యమా సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది వైష్ణవి.

ఆయన డైరెక్షన్ లో వచ్చిన అల వైకుంఠపురం మూవీలో అల్లు అర్జున్ కి చెల్లెలిగా నటించింది వైష్ణవి. ఆ తర్వాత బేబీ మూవీలో హీరోయిన్‎గా మారడానికి ఏనిమిదేళ్లు పట్టింది.

‘బేబీ’ మూవీతో వైష్ణవి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‎గా మారిపోయింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో అమ్మడి కెరీర్ కి ఢోకా లేకుండా పోయింది.

వైష్ణవి ఏకంగా 4 సినిమాలలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యిందని సమాచారం.సిద్దు జొన్నలగడ్డ సినిమాతో పాటు ఆనంద్ దేవరకొండతో మరోసారి జతకట్టబోతోందని తెలుస్తోంది.

వీటికితోడు కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. అంతే కాదు భయ్యో ఈ అమ్మడి ప్రస్తుతం ఇండస్ట్రీలో దుమ్ముదులుపుతున్న శ్రీలీలకు గట్టి పోటీ ఇస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా వైష్ణవి షాకింగ్ నిర్ణయం తీసుకుందట. ఒక స్టార్ హీరో మూవీలో ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్పిందని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో ఐటమ్ సాంగ్ లో కనిపించబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది.

నిజానికి ఈ మూవీలో ముందుగా సెకండ్ హీరోయిన్ గా వైష్ణవిని అనుకున్నారు. కానీ అది ఫైనల్ కాలేదు. అందుకే స్పెషల్ సాంగ్‎లో చేయడానికి అవకాశం ఇచ్చారని సమాచారం.

అయితే వైష్ణవి ఓకే చెప్పినా ఈ నిర్ణయాన్ని ఆమె స్వతహాగా తీసుకోలేదట. బేబీ డైరెక్టర్ సాయిరాజేష్ దగ్గరుండి ఒప్పించాడని తెలుస్తోంది.

ఏదేమైన టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి వైష్ణవి చేరుకుంటుందని భావించినప్పటికీ ఎందుకు ఈ ప్రయోగాలు అంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

Leave a Comment