Unstoppable With NBK: మహేష్ బాబుతో బాల కృష్ణ మరోసారి అన్ స్టాపబుల్.
బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్. చాలామంది సినీప్రముఖులు, హీరోలు ఇప్పటికే ఈ షో కి అతిథులుగా వచ్చి బాలకృష్ణతో కలిసి ప్రేక్షకుల్ని అలరించారు. అయితే ఇటీవల మహేష్ బాబు త్రివిక్రమ్ తో కలసి ఈ షో కి అతిధిగా వస్తున్నట్టు సమాచారం.
మహేష్ బాబు అన్ స్టాపబుల్ షో కి రావడం మొదటిసారి అయితే కాదు. ఇంతకు ముందు కూడా ఈ అన్ స్టాపబుల్ షో కి వచ్చాడు. ఈ సారి గుంటూర్ కారం ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు ఈ షో కి గెస్ట్ గా వస్తున్నారు.
ఈ సంక్రాంతికి గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ఎలాగూ విడుదల కి సిద్దంగా ఉంది, కాబట్టి ఈ షో ద్వారా మహేష్ బాబు సినిమా ప్రమోషన్ కూడా కలిసివస్తుంది.
ఇదంతా టాలీవుడ్ వర్గాల్లో ఇపుడు ఎక్కువగా జరుగుతున్న ప్రచారమే, ఐన అఫిషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు. అది కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మొదటి సారి అన్ స్టాపబుల్ కి వచ్చినపుడు మహేష్ బాబు బాలకృష్ణకి త్రివిక్రమ్ ని తీసుకువస్తానని మాట ఇచ్చాడు. దానిలో భాగంగానే ఈ షో కి మళ్ళీ వస్తున్నాడేమో.
జనవరిలోనే సినిమా విడుదల ఉండటం వల్ల జనవరి మొదటి వారంలోనే ఈ ఎపిసోడ్ వచ్చే అవకాశం కూడా ఉంది.గుంటూరు కారం పేరుకి తగ్గట్టుగానే పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనింగ్ సినిమా. దీనిలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ లు కలసి చేసిన సినిమాలు అతడు, ఖలేజా. ఆ తర్వాత వాల్ల ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఈ గుంటూరు కారం.
ఇక అన్ స్టాపబుల్ షో విషయానికి వస్తే ఇటీవల బాలకృష్ణ భగవంత్ కేసరి మరియు యనిమాల్ సినిమా టీంలతో సందడి చేశారు.