పలు రాష్ట్రాలలో గోబీ మంచురియా పై నిషేధం – ఇప్పుడు కర్నాటక కూడా

download 11 పలు రాష్ట్రాలలో గోబీ మంచురియా పై నిషేధం - ఇప్పుడు కర్నాటక కూడా

ఈరోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అమితం గా ఇష్ట పడేది ఫాస్ట్ ఫుడ్ ని. ఇవి అనేక రకాలుగా మార్కెట్ లో లభ్యం అవుతున్నాయి. వీటిలో చాలా ప్రాచుర్యం పొందిన ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్, చికెన్ మంచురియా, గోబీ మంచురియా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాల ఉంటుంది. ఇందులో శాఖాహారులు ఇష్టం గా తినేది గోబీ మంచురియా అని అందరికి తెలిసిన విషయమే.

ఇందులో క్యాలి ఫ్లవర్,మొక్కజొన్న ఫౌడర్, సోయా సాస్, వెనిగర్, చిల్లి సాస్, అల్లం, వెల్లుల్లి వంటి ఐటమ్స్ ఉపయోగించి తాయారు చేస్తారు. ఇక దీని రుచి విషయం లో చెప్పాలంటే ఇది చాల స్పైసీ గా టెస్టి గా ఉంటుంది. ఇప్పుడు ఈ గోబీ మంచూరియా మీద రక రకాల కధనాలు వస్తున్నాయి. ఇది చాల ప్రమాదకరమైన వంట అని దీని వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్పడం తో కొన్ని రాష్ట్రాలు దీనిని నిషేధించాయి.

దీనికి కారణం గోబీ మంచూరియా తయారీలో రంగు కోసం, రుచి కోసం, పలు రకాల సింధటిక్ రంగులు వాడుతున్నారని, అంతే కాకుండా దీని తయారి విషయం లో అసలు పరిశుభ్రత పాటించడంలేదని పరిశోధనలో బయట పడింది. ఇంకా ఇందులో వేసే సాస్ కూడా చాల ప్రమాదకరమైనదని ఇదిశరీరం లోకి ప్రవేశించాక విషం గా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. అంతే కాకుండా వీటిలో వాడే సరుకులు అసలు నాణ్యత లేనివి గా ఉంటున్నాయని రైడ్ చేసిన అధికారులు చెప్పారు.

ఇందులో ఉపయోగించే మొక్కజొన్న పౌడర్ అయితే కల్తి పౌడర్ ని మిక్స్ చేసి వాడుతున్నారని అధికారులు చెప్పారు. అంతే కాకుండా రోజులు తరబడి ఓకే నూని ని వాడుతున్నారని ఇది చాలా ప్రమాదకరం అని అధికారులు చెప్పారు. ఇది తిన్న వారికి అజీర్ణ సమస్యలు తో పాటు హై BP, భారి స్దులకాయం తో పాటు కాన్సెర్ లు కుడా వచ్చే అవకాశం చాల ఎక్కువగానే ఉంటుందని అధికారులు చెప్పారు. ఇదే విషయాన్ని డాక్టర్ లు కుడా చెప్తున్నారు. ఇప్పుడు పలు రాష్ట్రాలలో దీనిని నిషేధించారు. ఇప్పుడు నిషేధించిన రాష్టాల లిస్టు లో ఇప్పుడు కర్ణాటక కూడా చేరింది.

Leave a Comment