Onion Export ban: ఉల్లిపై మార్చి 31, 2024 వరకు నిషేధం!
కొత్త ఏడాది మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతిని ప్రభుత్వం నిషేదించింది. ప్రస్తుతం రవాణాలో ఉన్న సరుకులను కొన్ని కొన్ని నిబంధనలు, షరతులతో ఎగుమతి చేయడానికి అనుమతి ఇవ్వబడుతుంది డైరెక్టర్ అఫ్ ఫారిన్ ట్రేడ్ నివేదించింది.
స్థానిక ప్రాంతాలలో ఎంతవరకు లభ్యత ఉందో తెలుసుకోవడానికి, రకరకాల ధరలకు చెక్ పెట్టడానికి ఈ ఎగుమతి నిషేధాన్ని విధించింది.
ఈ ఉల్లి ఎగుమతి మార్చి 31, 2024 వరకు ఉచితం నుంచి నిషేధంగా మార్చబడింది.
ఈ నిషేధం 2023 డిసెంబర్ 8వ తారీఖు నుంచి అమలులోకి వచ్చింది.
అయితే DGFT పెట్టిన 3 షరతులు నెరవేర్చిన తరువాత ఈ ఉల్లిపాయల సరుకుల ఎగుమతికి అనుమతి లభిస్తుంది.ఈ నిషేధం విధించకముందే ఓడల్లో లోడ్ చేసిన ఉల్లి సరుకు, తీరానికి చేరుకున్న సరుకు ఇలాంటి సందర్భాలలో వీటి మినహాయింపు
కోసం ఉల్లిపాయలు కస్టమ్స్ కి అప్పగించిన చోట, ఉల్లిపాయలు కాస్టమ్స్ లోకి ప్రవేశించిన సమయం, ఇవన్నీ గమించిన తరువాత వీటి ఎగుమతి వ్యవధి జనవరి 5వ తేదీ 2024 వరకు పెంచారు.
వేరే దేశాలకు కేంద్రం ఇచ్చిన అనుమతి ఆధారంగా, కొన్ని కొన్ని అభ్యర్థనల కారణంగా ఈ ఉల్లిపాయల ఎగుమతి అనుమతించబడుతుంది.పెరుగుతున్న రేట్లను సమతుల్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఎగుమతి 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది.