Holiday On 22nd January? : జనవరి 22 సెలవు ప్రకటించండి – బండి సంజయ్

website 6tvnews template 50 Holiday On 22nd January? : జనవరి 22 సెలవు ప్రకటించండి - బండి సంజయ్

Holiday On 22nd January?: యావత్ ప్రపంచంలోని హిందువు సోదరులంతా ఈ నెల 22వ తేదీన జరగనున్న రామమందిర(Rama Mandir) ప్రారంభోత్సవం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమం లో ఆరోజును సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) కోరారు. రామ మందిర గర్భ గుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించడం అనేది పవిత్రమైన దైవ కార్యమని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలా చూడాలని సర్కారును అయన కోరారు.

ఇది ఇలా ఉండగా హుజూరాబాద్(Huzurabad) నియోజకవర్గంలోని ఇల్లందకుంటకు వచ్చిన ఎంపీ బండి, అక్కడ ప్రముఖ ఆలయమైన సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు సంజయ్ కు వేదాశీర్వచనం పలికారు.

ఆతరువాత బండి సంజయ్ చీపురు, పార చేత పట్టి రామాలయ పరిసరాలను శుభ్రం చేశారు. ప్రధాని మోదీ(PM Modi), బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా(JP Nadda) పిలుపు మేరకె దేవాలయాల శుద్ది కార్యక్రమానికి నడుం బిగించామని అన్నారు.

సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని శుభ్రం చేయడం సంతోషంగా వుందని వెల్లడించారు.

కాషాయ సైనికులకు ఫోన్లు చేస్తున్నారు : People Making Calls To Kashaya Sainiks

ఈనెల 22న అయోధ్యలో జరగబోయే రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారని అందుకే ఆ రోజును సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని(Telangana Government) కోరామని వెల్లడించారు.

వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజలంతా శ్రీరాముడి అక్షింతల కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారని చెప్పారు. పైగా రామ మందిర నిర్మాణ నిధి సేకరణ లో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన వుండటం సంతోషించదగ్గ విషయమన్నారు.

ఇక కరీంనగర్(Karimnagar) లో ప్రజలంతా తమ తమ ఇళ్ల ముందు ‘‘జై శ్రీరాం’’అనే వాల్ రైటింగ్ రాయించుకుంటున్నారని అన్నారు. తాను కూడా తన నివాసం ఆవరణలో స్వయంగా ‘‘జై శ్రీరాం’’అని వాల్ రైటింగ్ చేశానని చెప్పారు. స్థానిక ప్రజలు కొంతమంది కాషాయ సైనికులకు స్వయంగా ఫోన్లు చేసి తమ ఇంటికి జై శ్రీరాం వాల్ రైటింగ్ రాయాలని కోరుతుండటం విశేషమని చెప్పారు .

Leave a Comment