చెరువుల దగ్గర – బురద నేల దగ్గర పనిచేసేటప్పుడు జాగ్రత్త – లేదా గొంతుకలో ?

WhatsApp Image 2024 03 11 at 2.21.46 PM చెరువుల దగ్గర - బురద నేల దగ్గర పనిచేసేటప్పుడు జాగ్రత్త - లేదా గొంతుకలో ?


ఒక 53 సంవత్సరాల వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో తరచూ చాలా ఇబ్బంది వస్తోంది. దీని వల్ల అతను గురక, గొంతు నొప్పితో చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే మొదట తేలికపాటి జలుబె కదా అని అనుకున్నాడు. అయితే ఒకరోజు అతని నోటి నుంచి రక్తం రావడం జరిగింది. ఆ తర్వాత తనకు వచ్చింది జలుబు కాదని అర్థమైంది. చివరకు భయపడి డాక్టర్ దగ్గరకి వెళ్ళాడు. అప్పుడు డాక్టర్ తనకి ఉన్న సమస్యను తెలుసుకోవడం కోసం స్కానింగ్ తీయించాడు.

అప్పుడు ఆ రిపోర్ట్ చూసాక డాక్టర్ షాక్ గురి అయ్యాడు. ఎందుకంటే అతని గొంతులో ఉన్నది రక్తాన్ని పీల్చే జలగ ఉన్నట్లు గుర్తించారు.అది గొంతులోపల 6 సెంటిమీటర్లు పొడవు ఉందని చెప్పాడు. అది గొంతులో ఇరుక్కుపోయిందని శ్వాస నాళానికి క్రింద ఉందని స్కానింగ్ లో తెలిసింది. తర్వాత అతనికి మత్తు మందు ఇచ్చి గొంతుకకి ఆపరేషన్ చేసి జలగను బయటకి తీసారు. అసలు గొంతులోకు జలగ ఎలా వచ్చిందని ఆరా తీసారు డాక్టర్స్.

ఒకరోజు ఆ వ్యక్తి కి చేతికి దెబ్బ తగలడం తో ఇంటి ఆవరణ లో ఉన్న కొన్ని ఔషద మొక్కల ఆకులు తీసుకుని వాటిని నమిలి ముద్దల చేసి చేతికి గాయం ఉన్న చోట ఆ ముద్దను పూత లా వేసాడు. అయితే గాయం నయం అయింది కాని ఆ తర్వాత గొంతులో సమస్య వచ్చిందని చెప్పాడు. అయితే ఆ వ్యక్తి ఆకులను గొంతులో పెట్టుకున్నప్పుడు ఆ ఆకుల క్రింద జలగ ఉందని అది చూసుకోకుండా నోటిలో పెట్టుకోవడం వల్లే అది గొంతుకలోకి వెళ్ళిపోయిందని ఇంకా ఆలస్యం చేసి ఉంటె ప్రాణాలే పోయేవి అని డాక్టర్ లు చెప్పారు.

Leave a Comment