Nayanthara: ప్రేమను, భగవంతుడిని నమ్మండి..భర్తతో నయనతార ప్రత్యేక పూజలు.
లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్‌ల కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్యూట్ కపుల్స్ కలిసి దిగిన ఫోటోలను శనివారం నయన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఇద్దరూ ఏదో పూజ్ చేస్తున్న ఫోటోలను నయన్ తన అభిమానులతో పంచుకున్నారు. ఈ పిక్స్ లో నయనతార నలుపు రంగు బ్లౌజ్ వేసుకుని దానికి మ్యాచింగ్‌గా ప్లెయిన్ రెడ్ కలర్ చీరను అందంగా కట్టుకుంది.
మరోవైపు విఘ్నేష్ పసుపు రంగు కుర్తాలో కనిపించాడు. ఈ కపుల్స్ ఇద్దరూ ఓ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది. సంప్రదాయ వస్త్రాలు ధరించిన ఈ జంటకు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
విఘ్నేష్ శివన్‌తో కలిసి ఉన్న చిత్రాలను నయన్ షేర్ చేయడంతో పాటు అందమైన క్యాప్షన్ ను జోడించింది. క్యాప్షన్‌లో “ప్రేమ, దేవుడు, మంచితనానికి ఉండే శక్తిని విశ్వసించండి” అని అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చింది.
ఈ ఫోటోలపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ ఫ్యాన్ ” మీరు 35ప్లస్‌లోనూ ఎంతో అందంగా కనిపిస్తున్నారు…ఇది నమ్మశక్యం కాదు” అని కామెంట్ చేశాడు.
మరో నెటిజన్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ” అని తెలిపాడు. మరొకరు విఘ్నేష్ కోసం మెసేజ్ పెట్టాడు, “ఈ వ్యక్తి జీవితానికి లాటరీని గెలుచుకున్నాడు” అని వ్యాఖ్యానించారు.
మరోవైపు విఘ్నేష్ కూడా ఇవే ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. గత సంవత్సరం తమ కవల పిల్లలు ఉయిర్ ఉలగమ్‌లకు వెల్కమ్ చెబుతూ విఘ్నేష్ , నయనతార, సీక్రెట్ గా ఉంచిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
తన మూవీస్ తో పాటు వ్యక్తిత్వంతో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకుంది నయనతార . అందుకే ఈ స్టార్ హీరోయిన్ కి దక్కని ఇమేజ్ నయన్ సొంతం చేసుకుంది.
కోలీవుడ్ లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజే వేరు. ఈమె సినిమా విడుదలవుతుందంటే అభిమానులల్లో వేరే లెవెల్ అంచనాలు ఉంటాయి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు నయనతార.
పెళ్లైన తర్వాత చాలా మంది హీరోయిన్లు సినిమాలకు దూరంగా ఉంటుంటారు.కానీ నయన్ పెళ్లైన తర్వాతనే కెరీర్ లో ప్రయోగాలు చేస్తోంది. ఈ మధ్యనే ఈ బ్యూటీ ఫస్ట్ టైమ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో జోడీ కట్టి జవాన్ సినిమాతో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 1000 కోట్లు వసూళ్లను రాబట్టి రికార్డ్స్ బద్దలుకొట్టింది.
తాజాగా నయన తార మరో లేడీఓరియెంట్ సినిమాతో అలరిస్తోంది. జవాన్ తర్వాత నయన్ తమిళంలో ‘అన్నపూరణి’ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది.
నీలేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే..
నయన్ దాదాపు తెలుగు చిత్రాలకు దూరంగా ఉంటోంది. గాడ్ ఫాదర్ తర్వాత ఈ బ్యూటీ పెద్దగా తెలుగులో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదంట.భారీ పారితోషికం ఇస్తామన్నా నయన్ కోలీవుడ్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోందని తెలుస్తోంది.