Tyson Naidu First Look: టైసన్ నాయుడు గా రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.

Bellamkonda Srinivas is coming as Tyson Naidu.

Tyson Naidu First Look: బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh) తనయుడు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

మాస్ మసాలా అంశాలను దిట్టంగా దట్టించిన సినిమాల్లో హీరోగా చేసి యూత్ కి త్వరగా కనెక్ట్ అయ్యాడు. ఫైట్లు, రొమాంటిక్ సీన్లు, డాన్సులు ఇలా ఏవైనా సరే ఎక్కడ తగ్గకుండా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

అయితే ఈ హీరో ప్రభాస్(Prabhas) నటించిన ఛత్రపతిని(Chatrapati) వివి వినాయక్(VV Vinayak) డైరెక్షన్ లో హిందీ లో రీమేక్ చేశాడు. దాంతో మూడేళ్లపాటు తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యాడు.

అయితే మరల తెలుగు వారి ముందుకి వచ్చేస్తున్నాడు బెల్లంకొండ వారి అబ్బాయి. ఈ సారి గట్టి హిట్టు కొట్టి మునుపు వచ్చిన గ్యాప్ ను ఫీల్ చేసేయ్యాలని బలంగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నాడు.

అందుకు తగిన టైటిల్, టైటిల్ కి తగ్గట్టు బాడీ తో సడన్ ఎంట్రీ ఇచ్చి షేక్ చేసేస్తున్నాడు టాలీవుడ్ ను. భీంలా నాయక్(Bheemla Nayak)

దర్శకుడు సాగర్ కె చంద్ర(Sagar K Chandra) డైరెక్షన్స్ లో టైసన్ నాయుడు(Tyson Nayudu) గా కనిపించబోతున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

ఇది పడవ సినిమా : This Is Srinivas 10th Movie

bss10 Tyson Naidu First Look: టైసన్ నాయుడు గా రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.

టైసన్ నాయుడు శ్రీనివాస్ చేయబోతున్న 10వ సినిమా అందుకే దీనిని BSS 10 అని కూడా పిలుస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి టైటిల్(Title) అలాగే ఫస్ట్ లుక్(First Look) ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.

ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద రామ్ అచంట9Ram Achanta), గోపీచంద్ ఆచంట(Gopichand Achanta) నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి బీమ్స్(Beems) సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

శ్రీనివాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. పంజాబ్ సిక్కుల నేపధ్యంలో ఈ సినిమా కధ నడుస్తున్నట్టు టైటిల్ గ్లిమ్స్ చూస్తుంటే అర్ధమవుతోంది.

ఇక గ్లిమ్స్ ను కూడా బాగా మాసీగా మలిచారు. బీమ్లా నాయక్ తరువాత సాగర్ చేస్తున్న సినిమా ఇది, అలాగే శ్రీనివాస్ అల్లుడు అదుర్స్(Alludu Adurs) తరవాత తెలుగులో చేస్తున్న సినిమా ఇది.

కాబట్టి మంచి కంబ్యాక్ తో మునుపటి కన్నా మంచి జోరు హోరు చూపించాలని శ్రీనివాస్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ సినిమాకి ఎడిటింగ్(Editor) – కోటగిరివెంకటేశ్వరరావు(Kotagiri Venkateswararao), పోరాటాలు(Fights) – విజయ్, వెంకట్, రియల్ సతీష్

Leave a Comment