భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం లభిస్తుంది కానీ – S. జైశంకర్

jaishankar భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం లభిస్తుంది కానీ - S. జైశంకర్

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కచ్చితంగా వస్తుందని, ప్రపంచ దేశాలు అందులో స్థానాన్ని పొందాలనే భావన ఉంటుందని ఆయన అన్నారు. అయితే దాని కోసం ఈసారి మరింత కష్టపడాల్సి ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో మేధావులతోను, విలేఖరుల తోను జరిగిన ఇంటరాక్షన్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ బాడీలో భారతదేశం శాశ్వత సభ్యుడిగా మారే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.

ఐక్యరాజ్యసమితి 80 సంవత్సరాల క్రితం ఏర్పడిందని, ఇందులో ఐదు దేశాలు – చైనా, ఫ్రాన్స్, రష్యన్ ఫెడరేషన్, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్, ఈ దేశాలన్ని శాశ్వత సబ్యులు గా ఉన్నారు. అంతే కాదు ఈ దేశాలు భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు కావాలని తమలో తాము అంటే వారికి వారే నిర్ణయించుకున్నారని జైశంకర్ చెప్పారు.

ఆ సమయంలో ప్రపంచంలో మొత్తం 50 స్వతంత్ర దేశాలు మాత్రమే ఉండేవని, కాలక్రమేణా వీటి సంఖ్య దాదాపు 193కి పెరిగాయని ఆయన చెప్పారు. కానీ భద్రతా మండలి లో ఉన్న ఐదు సభ్య దేశాలు అన్ని అధికారాలను వారి నియంత్రణలో ఉన్నాయి కాబట్టి భద్రతా మండలి సభ్యత కోసం వారి అనిమతి ఇవ్వమని మీరు వెళ్ళి అడగండి అని చెప్పడం చాల వింతగా ఉంది.

భారతదేశం, జపాన్, జర్మనీ మరియు ఈజిప్ట్ కలిసి ఐక్యరాజ్యసమితి ముందు ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చాయని, ఇది ఈ అంశాన్ని కొంచెం ముందుకు తీసుకువెళుతుందని తాను నమ్ముతున్నానని కేంద్ర మంత్రి చెప్పారు.”అయితే మనం ఒత్తిడిని పెంచుకోవాలి, ఈ ఒత్తిడి పెరిగినప్పుడు UN బలహీనపడిందనే భావన ప్రపంచంలో దేశాలలో ఉంటుంది. ఉక్రెయిన్ యుద్ధంపై UN లో ప్రతిష్టంభన ఏర్పడిందని అంతే కాకుండా గాజాకు సంబంధించి UN లో ఏకాభిప్రాయం కుదరలేదు అని ఆయన అన్నారు. ఈ ఫీలింగ్ పెరిగేకొద్దీ మనకు శాశ్వత సీటు వచ్చే అవకాశాలు పెరుగుతాయని నేను భావిస్తున్నాను” అని ఆయన అన్నారు.

Leave a Comment