Bhagavanth Kesari Telivision Release : బుల్లి తెరపైకి భగవంత్ కేసరి

website 6tvnews template 2024 01 27T174738.293 Bhagavanth Kesari Telivision Release : బుల్లి తెరపైకి భగవంత్ కేసరి

Bhagavanth Kesari Telivision Release : నందమూరి అందగాడు, నటసింహం బాలయ్యబాబు(Bala Krishna) నటించిన సినిమా భగవంత్ కేసరి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టుకుంది.

శ్రీలీల(Srileela), బాలకృష్ణ ఇద్దరు కూడా తమతమ పాత్రల్లో జీవించేసి ప్రేక్షకులను మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

ఇక థమన్ అందించిన సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. సీనియర్ నటి జయచిత్ర(Jaya Chitra) చాల కలం తరువాత తెలుగు తెరపై మెరిశారు.

1557418923 nandamuri balakrishna sreeleela 2 Bhagavanth Kesari Telivision Release : బుల్లి తెరపైకి భగవంత్ కేసరి

ఈ సినిమాలో బాలయ్య కి తల్లి గా కనిపించారు. ఆమె కనిపించింది కొన్ని సన్నివేశాల్లో మాత్రమే అయినప్పటికీ ఆడియన్స్ తో కన్నీళ్లు పెట్టించారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్(Kajal) నటించింది.

ఈ సినిమా వెండి తెరమీద మాత్రమే కాదు ఓటిటీ లో విడుదలై కూడా ప్రేక్షకులను అలరించింది. అక్టోబర్ 19వ తేదీన థియేటర్ లో విడుదలైన ఈ సినిమా నవంబర్ 28 వ తేదీన ఓటిటీ లోకి అడుగు పెట్టింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా టెలివిజన్ లో కూడా ప్రసారం కాబోతోందని అంటున్నారు. జనవరి 28వ తేదీన జీ తెలుగు ఛానెల్ వారు ఈ సినిమాను బుల్లి తెరపై ప్రసారం చేయనున్నారట.

ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్(Arjun Ram Paul) విలన్ గా నటించాడు. తమిళ నటుడు శరత్ కుమార్ Sharat Kumar, రవిశంకర్ కీలక పాత్రలు పోషించారు.

Leave a Comment