Bharat Rice Available for Everyone : మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. బహిరంగ మార్కెట్లో పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ రైస్ (Bharat Rice) పేరుతో బియ్యాన్ని కిలో కేవలం రూ.29 చొప్పున అమ్మకాలు జరపాలని నిర్ణయించింది.
వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బియ్యం ఎగుమతులపై నిషేధం
ఉన్నప్పటికీ ధరలు 15 శాతం మేర పెరిగాయని చోప్రా అన్నారు.
నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో బియ్యాన్ని అందరికి అందుబాటు ఉంచుతామని, అందరికి ఈ రైస్ విక్రయిస్తామని ఈ సదుపాయాన్ని అందరు వినియోగించు కోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా అందరికి ఈ భారత్ రైస్ ఇ-కామర్స్ ద్వార
లభిస్తుందన్నారు.
ప్రజల సదుపాయం కోసం 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో ‘భారత్ రైస్’ అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రిత్వ శాఖ కార్యదర్శి చోప్రా తెలిపారు. రిటైల్ మార్కెట్లో తొలి దశలో బాగంగా ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు.
ఇప్పటికే భారత్ గోధుమపిండిని కిలో రూ.27.50, భారత్ దాల్ (శనగ పప్పు)ను కిలో రూ.60 చొప్పున కేంద్రం విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ధరలు అదుపులోకి తీసుకోచ్చెంత వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే, రి టైలర్లు, హోల్‌సేలర్లు, ప్రాసెసర్లు ప్రతి శుక్రవారం స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆదేశాలు కూడా జారీ చేసామని తెలిపారు.
దేశంలో బియ్యం తప్ప మిగిలిన అన్ని నిత్యావసరాల ధరలు అదుపులో ఉన్నాయన్నాయని ఆయన తెలిపారు