Bharat Rice – Exiting Offer For Middle Class People : కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెల ధరలు పెరిగాయంటే నూనె తగ్గించి వంట చేసుకోవచ్చు, పప్పు ధాన్యాలు ధరలు పెరిగాయంటే ప్రత్యామ్నాయ వంటలు చేసుకుందాం అని సరిపెట్టుకోవచ్చు.
కూరగాయల ధరలు పెరిగాయన్నా గాని వాటిలో కాస్తంత చవకగా దొరికే వాటిని పేద, మధ్యతరగతి వారు ఎంపిక చేసుకునే వీలుంటుంది. (Bharat Rice)కానీ బియ్యమే ధర పెరిగితే ఎం చెయ్యాలి, దానికి ప్రత్యామ్నాయం ఏముంటుంది ? ప్రస్తుత రోజుల్లో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి.
కేజీ బియ్యం 50 రూపాయల నుండి 60 రూపాయల వరకు పలుకుతోంది. ఇక ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు పాత బియ్యంలో కొత్త బియ్యాన్ని కల్తీ చేసి అమ్మేస్తున్నారు.
అందుకే భారత్ rice : Reason Behind Bharat Rice
అయితే బియ్యం ధరలు పెరగడం అనేది సామాన్య ప్రజానీకానికి సారాఘాతం లాంటిదని చూపొచ్చు. ఇది ఇలానే కొనసాగితే దేశంలో ఆకలి కేకలు పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించింది.
అందుకే భారత్ బియ్యం అనే పధకాన్ని ప్రవేశపెట్టింది.(Bharat Rice) కిలో బియ్యాన్ని 29 రూపాయలకే అందించడానికి ప్రణాళిక రచిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఏయే వస్తువులపై సబ్సిడీ ఉందంటే : On Which Things Subsidy Is Available
భారత్ రైస్ మాదిరిగానే భారత్ బ్రాండ్ కింద శనగపప్పును కిలో 60 రూపాయలకే ఇస్తున్నారు, అలాగే భారత్ ఆటా పేరుతొ గోధుమ పిండి అందిస్తున్నారు.
గోధుమ పిండిని కిలో 27.50 పైసలకు అందిస్తున్నారు. ఇక బియ్యం ధరలను అదుపులోకి తెచ్చేందుకు బియ్యం ఎగుమతులను నిలిపివేసింది,(Bharat Rice) కేవలం బాస్మతి బియ్యానికి మాత్రమే ఎగుమతుల అనుమతి ఉంది. అలాగే బాసుమతి బియ్యం ధరలు కూడా తగ్గించేందుకు ప్రయత్నాలు చేపట్టారు.
బడ్జెట్ లో పేదవారి కోసం : For Poor People In Badjet
ఇక లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రవేశ పెట్టిన మధ్యంతర బిల్లులో కేంద్రం పెద్దగా ఉచితాల మంత్రం జపించలేదని అర్ధం అవుతోంది.
ఈ బిల్లులో కేంద్రం రూఫ్ టాప్ సోలార్ పధకాన్ని, ఇళ్లు నిర్మించుకోవడానికి లోన్లు, లేదంటే సరసమైన ధరల్లో ఇళ్లు ఇవ్వడం తోపాటు ఆశావర్కర్ల అంగన్వాడీలకు ఆయుష్మాన్ భారత్ ను వరిపింపజేయడం వంటివాటిని మనం చూడొచ్చు.