బీహార్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం(Central Government) ఒక శుభవార్తను వినిపించింది. ఆ రాష్ట్ర ప్రజలు ప్రేమగా జన్ నాయక్ అని పిలుచుకునే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్(Ex CM Karpoori Thakur) కు భారత రత్నను(Bharataratna) ప్రకటించింది. జనవరి 24 వ తేదీ 1924 వ సంవత్సరంలో కర్పూరి ఠాకూర్ జన్మించారు.
అందుకే అయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డును అయన కుటుంబసభ్యులు అందుకుంటారు. ఇక కర్పూరి ఠాకూర్ బీహార్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్య మంత్రిగా పనిచేశారు. అయన 1970 నుండి 1971 వ రకు ఒకసారి అలాగే 1977 నుండి 79 వరకు రెండవసారి బీహార్ కు ముఖ్య మంత్రిగా సేవలు అందించారు.
ఇక కర్పూరి ఠాకూర్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారని అంటారు. అయన 1988 వ సంవత్సరంలో కన్ను మూశారు.
2024 జనవరి 24 వ తేదీ తో అయన శత వసంతాలు పూర్తిచేసుకుంటారు. అందుకే అయన శత జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. అయన తల్లి పేరు రామ్దులారి తండ్రి పేరు గోకుల్ ఠాకూర్, వీరిది పితౌంఝియా అనే ఒక కుగ్రామం. కేవలం ఒక సామాన్య నాయీ సామాజికవర్గం లో జన్మించిన కర్పూరి ఠాకూర్ అసామాన్య స్థాయికి ఎదగడం అనేకమందికి స్ఫూర్తిదాయకం.