Bharataratna For LK Advani : మాజీ ఉప ప్రధాని, బిజేపి అగ్ర నేత లాల్ కృష్ణ(LK Advani) అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఎల్‌కే అద్వానీని భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించనున్నట్టు(Bharataratna For LK Advani) స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) శనివారం ప్రకటించారు.
ఈ విషయాన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ, దేశానికి అద్వానీ చేసిన సేవలను మరోసారి గుర్తుచేసుకున్నారు. అలాగేనా అద్వానీకి స్వయంగా ఫోన్ చేసి, శుభాభినందనలు చెప్పినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అద్వానీ ఎంతో గొప్ప రాజనీతిజ్ఞుడని, దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర చరిత్రాత్మకమైననదని మోదీ కీర్తించారు. ఇక ఎల్‌కే అద్వానీ కి భారతరత్న అవార్డుకు ఎంపికయ్యారు అనే వార్తను ప్రజలతో పంచుకోవడం నిజంగా తనకు చాలా సంతోషంగా ఉందిని, పేర్కొన్నారు.
మోదీ స్పందన : PM Modi Response
ఇప్పుడున్న ఈ కాలంలో అత్యంత గౌరవనీయులైన వ్యక్తుల్లో ఎల్.కె అధ్వాని ఒకరఅని అన్నారు, భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరచిపోలేనిదన్నారు. బీజేపీ లో మామూలు కార్యకర్త స్థాయి నుండి, మన ఉప ప్రధానమంత్రిగా అయన ఎదిగిన తీరు, దేశానికి అయన చేసిన సేవ అయన జీవితం అందరికి స్ఫూర్తిదాయమైనదని చెప్పారు.
అద్వానీ దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో చేసిన సేవ రాజకీయ నీతిలో ఒక ఆదర్శప్రాయమైన ప్రమాణాన్ని నెలకొల్పాయని కీర్తించారు, జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా ఆయన అసమానమైన కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
ఆయనకు భారతరత్న అవార్డు ప్రదానం చేయడం తనవరకు తనకు చాలా భావోద్వేగభరితమైన సమయమని అన్నారు. ఆయనతో మాట్లాడేందుకు, అయన మాటల నుండి అనేక విషయాలు నేర్చుకుందేందుకు తనకు ఎంతగానో సమయం లభించినందుకు అదృష్టంగా భావిస్తానని అన్నారు.
ఎల్ కె అద్వానీ ఏమన్నారంటే : LK Advani About Bharatratna
ఇక భారతరత్న అవార్డుకు(Bharatratna) ఎంపిక కావడంపై అద్వానీ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ అవార్డును తాను అత్యంత వినయపూర్వకంగా స్వీకరిస్తానని చెప్పారు అద్వానీ.
ఇది తాను అనుసరించిన ఆదర్శవంతమైన జీవితానికి ప్రతీక అని అన్నారు. ఇక తనకు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు(Droupadi Murmu) ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తనకు 14 వయసు ఉన్నప్పుడు ఆరెస్సెస్(RSS) లో చేరానాని చెప్పారు, అప్పటి నుండి ఈ దేశం తనకు అప్పగించిన ప్రతి పనిని నిర్స్వార్ధంగా, అంకిత భావంతో నిర్వర్తించానని అన్నారు.(Bharataratna For LK Advani) తన జీవితంలో ఎవరితో అయితే పనిచేయడం గౌరవంగా భావించానో వారందరినీ ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నానని పేర్కొన్నారు.