తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ గెలుపొందిందన్న విషయం తెలిసిందే.
ఈ విజయం మాములు విజయం కాదు . తెలంగాణలోని ఎన్నికల్లో 119 స్థానాలకుగాను 64 స్థానాలు గెలుచుకుంది కాంగ్రే. ఎన్నికల ఫలితాల తరువాత ముఖ్యమైన ఘట్టం మంత్రి వర్గం యొక్క ఏర్పాటు.
ఇక ఆ ప్రక్రియలోనే ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. గెలుపొందిన పార్టీ ముఖ్యులందరు కలిసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిర్ణయించారు.
గురువారం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరం చేయనున్నారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అక్కడ పార్టీ పెద్దలైన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తదితరులను కలిసి తిరిగి హైదరాబాద్ కి తిరిగి వచ్చాక ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ ప్రమాణస్వీకారానికి కాంగ్రేస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, దీపేందర్ తదితర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణస్వీకారం జరుగుతుంది.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారన్న విషయం తెలిసినదే , ఇక డిప్యూటీ సీఎం గా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మధిర శాసనసభ నియోజకవర్గానికి శాశనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రేస్ పార్టీ నాయకుడు, తెలంగాణ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టనున్నారు.
సీనియర్ మోస్ట్ నాయకుడైన భట్టి విక్రమార్క, అన్ని రకాలా అర్హుడైన అతన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డిని సీఎంగా చేయడం పట్ల కాస్త వ్యతిరేకత చూపించినప్పటికీ పార్టీ ముఖ్యులు అందరూ కలిసి అతన్ని సమాధానపరచి, తనకి నచ్చిన మంత్రివర్గాన్ని అప్పజెప్పినట్టుగా ఉన్నతవర్గాల సమాచారం.