Bhimaa teaser release: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand)తాజాగా నటించిన మూవీ భీమా (Bhimaa). ఈ మూవీతో కన్నడ డైరెక్టర్ ఎన్ హర్ష (N Harsha) తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు.
యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా వస్తున్న భీమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ (Sri Satya Sai Arts Banner)పై ప్రొజ్యూజర్ కెకె రాధామోహన్ (KK Radhamohan)ప్రెస్టీజియస్ మూవీగా నిర్మిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా భీమాను ఫిబ్రవరి 16 విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ మూవీకి సంబంధించిన పోస్టర్స్ ని రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా భీమా టీజర్ (Bhimaa Teaser)ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ తెలుగు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది.
చాలా రోజుల తర్వాత గోపీచంద్ పోలీస్ గెటప్‌లో పవర్ఫుల్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. టీజర్లో గోపిచంద్ ఎద్దుపై కూర్చుని కనిపించిన తీరు ఆయన ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ తో మేకర్స్ భీమా ప్రమోషన్స్‌కి కిక్ స్టార్ట్ ఇచ్చారు.
Bhimaa Teaser Review: భీమా టీజర్ ఎలా ఉందంటే
సుమారు ఒక నిమిషం డ్యూరేషన్ ఉన్న భీమా టీజర్ (Bhimaa Teaser) వేరే లెవెల్లో ఉంది. ‘యధా యధా ధర్మస్య’ అనే భగవద్గీత శ్లోకాల పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో భీమా టీజర్ స్టార్ట్ అయ్యింది.
టీజర్ ప్రారంభంలో మునులు, దుష్ట శక్తులు కనిపిస్తారు. రాక్షసుల్లాంటి కొంత మంది మనుషులు వారిని హింసిస్తున్నట్లు చూపించారు. ఈ క్రమంలో పోలీస్ గెటప్ లో గోపీచంద్ (Gopichand) ఎంట్రీ ఇచ్చాడు.
డిఫరెంట్ సెటప్‌తో , స్టోరీ కాన్సెప్ట్‌తో భీమా వస్తున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ టీజర్ ఆధ్యంతం యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆధ్యాత్మిక అంశాలతో నిండివుంది.
ముఖ్యంగా ఈ టీజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ లో ఉంది. ప్రభాస్ (Prabhas) సలార్ (Salaar)మూవీకి మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ (Ravi Basrur) భీమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వీర్ లెవెల్ ఇచ్చారు.
ఈ మ్యూజిక్ మాత్రం అందరిని మెస్మరైజ్ చేస్తోంది. ఇక స్వామి జె గౌడ (Swamy J Gouda)కెమెరా పనితనం అత్యద్భుతంగా ఉంది. డైరెక్టర్ టేకింగ్ చూసి వావ్ అనాల్సిందే.
ఎడిటర్ కూడా క్యూరియాసిటీని పెంచేలా టీజర్ ను ఎంతో క్రియేటివ్ గా కట్ చేశాడు. ‘భీమా’ ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది. ఇదే విషయాన్ని మేకర్స్ టీజర్ ద్వారా తెలిపారు.
భీమాలో ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), మాళవిక శర్మ (Malavika Sharma)లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Gopichand’s introduction next level : గోపీచంద్ ఇంట్రడక్షన్ ని వేరే లెవెల్
టాలీవుడ్ లో గోపీచంద్ (Gopichand)హిట్టు కొట్టి చాలా సంవత్సరాలు అవుతోంది. ఈసారి ఎలైగానా హిట్టు కొట్టాలన్న కసితో సక్సెస్ కోసం గోపీచంద్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది..
ఈ నేపథ్యంలోనే భీమా (Bhimaa) అంటూ తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత గోపీచంద్ మళ్లీ ఖాకీ యూనీఫామ్ లో దర్శనమిచ్చాడు.
టీజర్ లో ‘రాక్షసులను వెంటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా’ అంటూ బ్యాక్ గ్రౌండ్లో వచ్చే వాయిస్ ఓవర్‌తో వచ్చే గోపీచంద్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించాయి .
దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న భీమా నుంచి మేకర్స్ ఇవాళ టీజర్ ని విడుదల చేశారు.
ఈ టీజర్‌తో గోపీచంద్ అదరగొట్టేశాడు. రవి బస్రూర్(Ravi Basrur) అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , స్వామి జే గౌడ విజువల్స్ ఎఫెక్ట్స్ భీమా టీజర్‌కు హైలెట్‌గా నిలిపాయి.
కన్నడ డైరెక్టర్ హర్ష (N Harsha)మేకింగ్ అయితే మూవీపై ఓ రేంజ్ హైప్‌ని క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్లలో సందడి చేయబోతోంది. రాక్షసుల్ని వేటాడే బ్రహ్మా రాక్షసుడిలా గోపీచంద్ పోలీస్ క్యారెక్టర్లో రెచ్చిపోయేందుకు రెడీ అవుతున్నాడు.