Bhopal gas tragedy: మాసిపోని విషాదానికి 39 ఏళ్ళు.
ప్రపంచంలోనే భారీ పారిశ్రామిక దుర్ఘటన, భోపాల్ దుర్ఘటన.. ప్రపంచం ఉలిక్కిపడ్డ ఈ ఘటన 1984, డిసెంబర్ 2, 3 తేదీల మధ్య జరిగింది. నేటికీ ఈ విషాదం జరిగి 39 ఏళ్ళు. ఈ రోజుకీ మధ్యప్రదేశ్ లోని భోపాల్ ప్రజలు ఈ సంఘటనని మోస్తూనే ఉన్నారు.
అసలు అంత దారుణమైన సంఘటన ఏంటి ? ఎలా జరిగింది? ఇంతపెద్ద విషాదాన్ని మిగిల్చిన కారకులు ఎవరు ? వివరాల్లోకి వెళ్తే…
1979లో మిథైల్ ఇసోసైనైడ్ ప్రొడక్షన్ కోసం భోపాల్ లో ఇక్కడ ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేసారు. పరిశ్రమనైతే ఏర్పాటు చేసారు కానీ అక్కడి కార్మికుల భద్రతకు ఒక్క ఏర్పాటు కూడా చేయలేదు.
2,3 డిసెంబర్ 1984 లో రాత్రి కర్మాగారంలో ఉన్న 610 నెంబర్ ట్యాంక్ నుంచి నీరు బయటకు రావడం మొదలైంది.మిథైల్ ఐసోనైట్ మరియు నీరు కలవడంతో ట్యాంకు లోపల ఒక్కసారిగ ఉష్ణోగ్రత పెరిగి తారాస్థాయికి చేరుకుంది.
దాదాపు 45 నిముషాల్లోనే 30 మెట్రిక్ టన్నుల గ్యాస్ లీకయ్యింది.ఈ లీకయిన వాయువు నగరమంతటా దావాణలంలా వ్యాపించింది.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ విషవాయువు భారిన 15 వేలకు పైగా మృత్యువాతపడ్డారు. అదృష్టం కొద్దీ బయటపడినవారు కూడా ఈ వాయువు ప్రభావంతో అనేక రకాల జబ్బుల భారినపడ్డారు.
బయటపడినవారుపై మాత్రమే కాదు ఈ వాయువు ప్రభావం వాళ్ళ తర్వాతి తరం వాళ్ళని కూడా జబ్బుల రూపంలో వెంటాడుతూనే ఉంది.ఇప్పటికి బాధితుల కుటుంబసభ్యులు, వారి పిల్లలు ఈ విషవాయువు ప్రభావాన్ని భరిస్తూనే కాలం వెల్లదీస్తున్నారు.
ఈ భోపాల్ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య: 2,259 అని అప్పట్లో అధికారికంగా ప్రకటించారు, కానీ ఇతర నివేదికల ప్రకారం ఎనిమిది వేల మంది ఈ దుర్ఘటనలో మరణించారు.
3,787 మంది ఈ ప్రమాదంలో ప్రభావితులయ్యారని మధ్యప్రదేశ్ నివేదికనిచ్చింది, కానీ దాదాపు మరో ఎనమిది వేల మంది ఈ దుర్ఘటన ప్రభావంతో మరణించారని ఇతర నివేదికల నుంచి సమాచారం.
2010 జూన్ లో UCIL కి సంబందించిన ఏడుగురు మాజీ ఉద్యోగులకు 2 సంవత్సరాల జైలుశిక్ష, జరిమానా విధించారు. కానీ అంతమంది అమాయకుల ప్రాణాల్ని బలితీసుకున్న వ్యక్తులకి శిక్ష గురించి తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే బెయిలు రావడమే పెద్ద విషాదం….