Bhumika Chawla: చెక్కుచెదరని అందం భూమిక సొంతం.

Bhumika owns the unspoiled beauty.


Bhumika Chawla: చెక్కుచెదరని అందం భూమిక సొంతం.

టాలీవుడ్‎లో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది భూమికా చావ్లా. ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన చిత్రాలతో సందడి చేస్తోంది ఈ భామ.

సింపుల్‎గా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అతికొద్ది సమయంలోనే స్టార్డమ్ సొందం చేసుకుంది భూమికా. అగ్ర హీరోలకు జోడీగా మెరిసి ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

హీరోయిన్‎గా ఫస్ట్ ఇన్నింగ్స్‎లో ఇరగదీసిన భూమిక ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్‎లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు మళ్లీ దగ్గరవుతోంది.

సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ భూమిక చాలా బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా భూమికా చావ్లా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను షేర్ చేసింది.ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్‎లో వైరల్ అవుతున్నాయి.

Bhumika got craze with Khushi:

భూమిక మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. మోడలింగ్ రంగంలో తన అందంతో ఎనలేని గుర్తింపును పొందింది. అమ్మడి న్యేచురల్ బ్యూటీకి ఫిదా అయిన ఫిల్మ్ మేకర్స్ సినిమాల్లో అవకాశం ఇచ్చారు.

అలా భూమిక మొదట తెలుగులో సుమంత్ హీరోగా నటించిన ‘యువకుడు’లో అవకాశం దక్కించుకుంది. ఈ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan)నటించిన ‘ఖుషీ'(kushi)లో బంపర్ ఆఫర్ కొట్టేసింది భూమిక.

ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అవడంతో ఈ బ్యూటీకి క్రేజ్‌ కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో భూమిక ఖుషీ సినిమాతో సెన్సేషనల్ హీరోయిన్ అయింది.

ఫలితంగా ఆమెకు తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత భూమిక ఎన్నో చిత్రాల్లో నటించింది అవన్నీ కూడా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

అందులో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు (mahesh babu)తో ‘ఒక్కడు'(okkadu),జూనియర్ ఎన్టీఆర్‌ (jr ntr)తో ‘సింహాద్రీ'(simhadri) సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.

యంగ్ హీరో, సీనియర్ హీరో అని చూడకుండా టాలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలతో నటించింది భూమిక. తెలుగులోనే కాదు..భూమిక చాలా భాషల్లోనూ నటించింది.

Hot show at this age:

తన సుదీర్ఘమైన సినీ జర్నీలో భూమిక చాలా తక్కువ సందర్భాల్లోనే గ్లామర్ రోల్స్ చేసింది. కానీ,ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చెలరేగిపోతోంది. తల్లైన తర్వాత కూడా ఈ బ్యూటీ అందాలను ఆరబోస్తూ హీట్ పెంచుతోంది. తాజాగా భూమికా ట్రెడిషనల్ లుక్‎లో కట్టిపడేసింది.

చెక్కు చెదరని అందంతో తన ఫాలోవర్స్‎ను ఫిదా చేసింది. నెటిజన్లు భూమికాను ఇలా చూస్తూ ఖుషీ అవుతున్నారు. భూమిక షేర్ చేసిన చిత్రాలకు అభిమానులు,

నెటిజన్లు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సీనియర్ బ్యూటీ అందాన్ని ప్రశంసిస్తూ ఆకాశానికి ఎత్తుకుంటున్నారు. లేట్ వయస్సులోనూ భూమికా అందాలు వావ్ అంటూ పొగిడేస్తున్నారు.

భూమిక తన పెర్ఫామెన్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో స్పెషల్ ఇమేజ్‎ను సొంతం చేసుకుంది.దాదాపు యాబైకి పైగా సినిమాల్లో హీరోయిన్‎గా నటించిన భూమిక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‎ను

ప్రారంభించింది. స్టార్ హీరోలకు వదినగా, అక్కగా క్యారెక్టర్ పాత్రల్లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది.

ఎంసీఏ, యూటర్న్, రూరల్,సవ్యసాచి, సీటీమార్,సీతా రామం,బటర్ ఫ్లై వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‎గా నటించింది.

సౌత్‎లోనే కాదు బాలీవుడ్‎ (bollywood)లోనూ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (salman khan) నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ (kisi ka bhai kisi ka jaan)సినిమాలో నటించి అందరిని మెప్పించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ సెకెండ్ ఇన్నింగ్స్‎లో అదరగొడుతోంది భూమిక. తన ఫ్యాన్స్‎ను ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం భూమికా కోలీవుడ్‎ (kollywood )లో ఓ మూవీ చేస్తోంది. తమిళ స్టార్ హీరో జయం రవి (jayam ravi)నటిస్తున్న బ్రదర్ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్ మీద ఉంది.

ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో వరుస చిత్రాలతో మంటలు రేపుతోంది భూమికా.

సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటి నుంచి భూమికా చావ్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది.

అటు అభిమానులకు దగ్గరవుతూనే ఇటు మూవీ మేకర్స్‎కు నటించేందుకు నేను రెడీ అంటూ హింట్ ఇస్తోంది.

అందుకే ఎప్పికప్పుడు తన ఇన్‏స్టాగ్రామ్‎లో అద్భుతమైన ఫొటోలను పంచుకుంటోంది. ఈ మధ్య మరీ యంగ్ లుక్ లో దర్శనమిస్తూ అందరి మతులు పోగొడుతోంది.

Leave a Comment