గేమ్ ఛేంజర్’నుంచి బిగ్ అనౌన్స్‎మెంట్

cr 20240326tn66026b9ed8c35 గేమ్ ఛేంజర్’నుంచి బిగ్ అనౌన్స్‎మెంట్

Big announcement from Ram Charan’s ‘Game Changer’ : ఎట్టకేలకు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చరణ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’(Game Changer) నుంచి బిగ్ అనౌన్స్‎మెంట్ వచ్చేసింది. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి ‘జరగండి’(Jaragandi)జరగండి అనే సాంగ్ రిలీజ్ కు రెడీ అయ్యిందని మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను షేర్ చేసి చరణ్ ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ చేతిలో ఉన్న పుస్తకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫేమస్ రైటర్ చలం (Chalam) గారు రాసిన ‘ప్రేమ లేఖలు’పుస్తకం అది. ఆ పుస్తకానికి, ఈ పోస్టర్ కి రామ్ చరణ్ పాటకు, బ్యాక్ గ్రౌండ్ కు సంబంధం ఏంటని అందరూ తమ మెదడుకు పనిచెబుతున్నారు. అయితే ఇది ఒక లవ్ సాంగ్ అని చెప్పడానికే ఇలా పోస్టర్‌ సెట్ చేశారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ కాలం యూత్ కు ఈ బుక్ గురించి తెలియకపోయినా…అప్పట్లో లవ్ స్టోకీస్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘ప్రేమ లేఖలు’(Prema Lekhalu).

చరణ్ చేతుల్లో ఆ పుస్తకం :


దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)తీసిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan ) కాస్త గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ లో చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju)క్యారెక్టర్ కి వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు చరణ్. దీంతో చరణ్ సినిమాల కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer).కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో చరణ్ డ్యూయెల్ రోల్‌లో కనిపిస్తాడని సమాచారం. ఈ మధ్యనే విడుదలైన చరణ్ పోస్టర్ ఫ్యాన్స్ లో కొత్త ఊపు తీసుకువచ్చింది. ఇప్పుడు లేటెస్టుగా మేకర్స్ ఆయన బర్త్ డే గిఫ్ట్ గా సినిమా నుంచి ‘జరగండి’ పాట పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ‘ప్రేమ లేఖలు’పుస్తకాన్ని పట్టుకొని చరణ్ కనిపించాడు. అంటే ఇది వింటేజ్ రామ్ చరణ్‌కు సంబంధించిన పాట అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరికొందరు అదికాదని కొట్టేస్తున్నారు

ఫ్యాన్స్ గెట్ రెడీ :

మేకర్స్ ఫుల్ కలర్‎ఫుల్‎గా ‘జరగండి’(Jaragandi)సాంగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ (Ram Charan ) ఈ పోస్టర్ లో స్టైలిష్‌ లుక్ లో అదరగొట్టాడు. మార్చి 27న చరణ్ బర్త్ డే కావడంతో ఈ పాట రిలీజ్ కు రెడీ అయ్యింది. బుధవారం ఉదయం 9 గంటలకే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నెట్టింట్లో పోస్ట్ ను షేర్ చేసింది. ‘డ్యాన్స్ షూస్ వేసుకొని రెడీ గా ఉండండి’ అంటూ చరణ్ అభిమానులకు పిలుపునిచ్చింది. ‘గేమ్ ఛేంజర్’లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ( Kirara Advani)నటించింది. టాలీవుడ్ సీనియర్ నటులు శ్రీకాంత్ (srikanth), సునీల్ (Sunil)లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు.

చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ :

ప్రస్తుతం శంకర్ (Shankar )డైరెక్షన్ లో గేమ్ ఛేంజ‌ర్(Game Changer )మూవీ పూర్తి కాగానే ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు(Buchhi Babu)తో ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేయ‌బోతున్నాడు. గ్రామీన నేపథ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ పాన్ ఇండియ‌న్ సినిమాలో క‌న్న‌డ స్టార్ హీరో శివ‌రాజ్‌కుమార్ (ShivaRajkumar) కీల‌క పాత్రలో కనిపించునున్నారు

Leave a Comment