Big boss 7 host King Nag who lost patience : సహనం కోల్పోయిన కింగ్ నాగ్! నేను మాట్లాడుతుంటే..

maxresdefault 1 Big boss 7 host King Nag who lost patience : సహనం కోల్పోయిన కింగ్ నాగ్! నేను మాట్లాడుతుంటే..

సహనం కోల్పోయిన కింగ్ నాగ్..! నేను మాట్లాడుతుంటే..
బిగ్ బాస్ వరుస సీజన్లను హోస్ట్ చేస్తున్న కింగ్ నాగ్.. అతి కొద్ది సందర్భాల్లోనే.. కంటెస్టెంట్స్ పై సహనం కోల్పోయి.. కాస్త సీరియస్ అయ్యారు. ఇక ఇవ్వాళ్టి 63rd ఎపిసోడ్లోనూ.. డాక్టర్ బాబు గౌతమ్పై అదే చేశారు. గౌతమ్ రెయిజ్ చేసిన ఇష్యూనే.. సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న నాగ్ మాటలకు… డాక్టర్ బాబు అడ్డు పడడంతో.. కింగ్ కాస్త సీరియస్ అయ్యారు.


ఇక ఎప్పటిలాగే.. బిగ్ బాస్ 63rd ఎపిసోడ్ కూడా.. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఆటతీరును కొలిచే ఎపిసోడ్లాగే సాగింది. కింగ్ నాగార్జున షో మొదలెట్టి… శుక్రవారం హౌస్లోని సభ్యుల ఆటను నేరుగా చూడడం…. వాళ్ల ఆటతీరుకు అనుగుణంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం.. ఆ తర్వాత నేరుగా మన టీవీలోకి వెళ్లి.. హౌస్ మేట్స్ కు వాతలు పెట్టడం.. వీలైతే అందులో కొంత మందిని అప్రిషియేట్ చేయడం…! సేమ్ టూ సేమ్ ఇలానే సాగింది తాజాగా ఎపిసోడ్.


శోభ కెప్టెన్ అయిన తర్వాత జరిగిన పరిణామాలను… షో బిగినింగ్లో చూసిన నాగ్.. శోభ, టేస్టీ తేజ మధ్య జరిగిన గొడవను, ప్రిన్స్ , శివాజీల మధ్య వచ్చిన మనస్పర్దలను గమనిస్తాడు. ఆ తరువాత మన టీవీ అంటూ… షో మొదలెట్టిన వెంటనే… వీళ్లను అడ్రస్ చేస్తాడు. తేజ చెప్పినట్టు కాకుండా… అమర్ తనంతట తానే శోభ కోసం కెప్టెన్సీ గేమ్ ఆడేందుకు వెళ్లాడని… తేజ చెబితే వెళ్లలేదని.. శోభకు క్లియర్గా చెబుతాడు నాగ్.


ఒకరు కెప్టెన్ అయ్యాక.. వారే మరో సారి కెప్టెన్ అవకూడదనే రూల్ బిగ్ బాస్లో లేదని.. హౌస్లో కెప్టెన్గా ఎన్నికవ్వడం అనేది ఇంటి సభ్యుల కలెక్టివ్ డెసీషన్ అని.. సో దాంట్లో ఎవర్నీ తప్పుబట్టడం అవసరం లేదని చెబుతాడు కింగ్.
ఇక ఈ ఎపిసోడ్లో… కంటెస్టెంట్స్ ఈ వారం పర్ఫార్మెన్స్ను కొలవడానికి బంగారం, మట్టి, బొగ్గే అనే మూడు క్యాటగిరీలతో ముందుకు వచ్చిన నాగ్.. మొదట శోభను అప్రిషియేట్ చేస్తాడు. కెప్టెన్గా ఎన్నికైనందుకు కంగ్రాట్స్ చెబుతూనే.. ఈ వారం శోభ ఆట బాగుండడంతో… ఆమె ఫోటోను బంగారం కాలంలో పెట్టేస్తాడు.


ఆ తరువాత అమర్ ఆటతీరును కూడా మెచ్చుకున్న నాగ్.. అమర్కు ఇలాగే ఆడాలని చెబుతాడు. తన ఫోటోను కూడా బంగారం కాలమ్లో పెడతాడు. శివాజీ, ప్రశాంత్, ప్రియాంక ఆటతీరు కూడా.. బంగారమే అంటూ.. వారి వారి ఫోటోలకు బంగారం కేటగిరీలో పెడతాడు.


అర్జున్ ఆటతీరుకు కూడా బంగారం ఇచ్చిన కింగ్ నాగ్.. టాస్కుల్లో కాకుండా రిమైనింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలంటూ సూచిస్తాడు. ప్రిన్స్ యావర్కు వ్యక్తులపై కాకుండా.. గేమ్ పై ఫోకస్ చేయాలని నాగ్ చెబుతాడు. ఇక రతిక, భోళె ఆటతీరు ఏమాత్రం బాలేదంటూ.. బొగ్గు కాలమ్లో వారి ఫోటోలను పెడతాడు నాగ్.


కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో ఒక టీం నుంచి మరొక టీంకు స్వాప్ అయిన భోళె.. తను దక్కించుకున్న బ్లాక్ బాల్ను మునుపటి టీంలో వదిలిపెట్టడం పై క్లాస్ పీకాడు నాగ్. భోళె తీరును తప్పుబడ్డాడు. ఆట బాగా ఆడాలని.. స్ట్రాంగ్ అని నీకు నువ్వు ఫీలవ్వాలని చెబుతాడు.


ఇక అంతకు ముందే.. ‘హౌస్లో కొంత మంది నాగ్ సార్తో తేల్చుకుంటామని అన్నారు.. వారు తనతో ఏం తేల్చుకుంటారో చెప్పాలని’ నాగ్ అనగా.. మొదట టేస్టీ తేజ లేస్తాడు. హాల్ ఆఫ్ బాల్ టాస్క్లో శివాజీ వల్లే తాను బాల్స్ దొంగతనం చేయలేక పోయా.. దాని వల్లే తమ టీం ఓడిపోయిందని చెబుతాడు. అందుకు శివాజీ అది తన గేమ్ ప్లాన్ అనగా… నాగ్ కూడా.. అది వారి గేమ్ ప్లాన్.. ఆపోజిట్ టీం మాటలు విని ఊరుకున్న నువ్వే ఎర్రిపప్ప అంటూ తేల్చేస్తాడు.


ఆ తర్వాత గౌతమ్ కూడా తనకు ఓ ఇష్యూ ఉందని చెప్పగా.. కన్ఫెషన్ రూంకు వెళ్లమని.. తన ఇష్యూ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు నాగ్. కెప్టెన్సీ టాస్క్లో.. శివాజీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని.. వాంటెడ్లీ తనను కార్నర్ చేసి.. గేమ్ నుంచి తప్పించాడని నాగ్ కు కంప్లైట్ చేశాడు. అందుకు నాగ్ .. ఇదే ఇష్యూను హౌస్ మెంబర్స్ ముందు అడ్రెస్ చేయాలని.. సో దట్… అందరికీ శివాజీ మ్యాటర్లో ఓ క్లారిటీ వస్తుందంటూ చెబుతాడు.


ఇక మళ్లీ లివింగ్ ఏరియాలోకి వచ్చిన గౌతమ్ .. శివాజీ తనకు చేసిన అన్యాయం ఏంటో చెబుతాడు. అందుకు నాగ్ .. ఒక్కో కంటెస్టెట్ దగ్గరి నుంచి ఈ విషయంలో క్లారిటీ తీసుకుంటూ ఉండగా.. వారి మాటలకు అడ్డు తగిలేలా.. గౌతమ్ మాట్లాడుతుంటాడు. ఓ సందర్భంలో నాగ్ మాటలకు కూడా అడ్డు పడడంతో… నాగ్ సహనం కోల్పోతాడు. గౌతమ్ నా మాటలు ఫినిష్ అయ్యాక మాట్లాడు… అంటూ కాస్త గట్టిగా గౌతమ్ను మందలిస్తాడు.


నువ్వు కెప్టెన్ అవకూడదనేది.. ఒక్క శివాజీ డెసీషిన్ కాదని.. ఇట్స్ ఏ కలెక్టివ్ డెసీషన్ అని.. చెబుతాడు. అందుకు వారి టీంలో డిస్కషన్ జరిగిందని.. అది అందరి డెసీషన్ అనే తేలస్తాడు. ఇన్ఫాక్ట్ నీ టీంలోనే కలెక్టివ్ డెసీషన్ మిస్సైందని.. నువ్వే ఎవరినీ అప్రొచ్ అవకుండా.. ఓ సందర్భంలో భోళెను నేమ్ చెబుతావంటాడు. చెప్పుడు మాటలు.. అందులోనూ అశ్విని మాటలు విని నువ్వు ఇలా అగ్రెసివ్ అవుతున్నావంటూ క్లాస్ పీకుతాడు. చెప్పుడ వినుడు మాత్రమే కాదు.. ఆ మాటలు గురించి వన్స్ ఆలోచించాలని గౌతమ్కు సూచిస్తాడు.


ఆ తర్వాత అశ్వినిని కూడా… మందలించి గేమ్ డోస్ పెంచాలని.. ఇలాంటి పుల్లలు పెట్టే యాక్టివిటీ తగ్గించి గేమ్లో విన్నర్ అవ్వాలని సూచిస్తాడు. తన పర్ఫర్మెన్స్కు బొగ్గు ఇస్తాడు. వచ్చే వారం ఆట బెటర్ చేసుకోవాలని చెబుతాడు.

Leave a Comment