Big boss 7 Teju eliminated but sandeep story viral : తేజ ఎలిమినేటెడ్. సందీప్ ఇన్ స్టా స్టోరీ వైరల్.
బిగ్‌బాస్ హౌస్‌లో మొదటి వారం నుంచి ఇప్పటివరకు తేజ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఇప్పటివరకు ఆరుగురిని హౌస్ నుంచి బయటకు పంపాడు తేజ. మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయితే అందులో ఆరుగురు తేజా నామినేషన్‌తో ఎలిమినేట్ అయ్యారు.
దీంతో ఇప్పుడు హౌస్‌లో టేస్టీ తేజ ఐరన్ లెగ్ అనేది అర్థమవుతుంది. మూడో వారంలో దామిని.. నాలుగో వారంలో రతిక.. ఐదో వారంలో శుభ శ్రీ.. ఆరో వారంలో నయని.. ఏడో వారంలో పూజా.
ఎనిమిదో వారంలో సందీప్.. ఇలా మూడో వారం నుంచి ఎనిమిదవ వారం వరకు వరుసగా తేజా ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ అయిపోతూ వస్తున్నారు. అయితే వరుసగా అందర్ని బయటకు పంపిన తేజ.. ఇప్పుడు తనే బయటకు వచ్చేశాడు. అయితే ఇప్పటికీ తేజ ఎలిమినేషన్ విషయం అధికారికంగా తెలియదు.
కానీ సోషల్ మీడియాలో మాత్రం అతను ఎలిమినేట్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. ఇక తాజాగా తేజ ఎలిమినేషన్ పై సందీప్ రియాక్ట్ అయ్యారు.
తేజ ఎలిమినేషన్ పై సందీప్ ఇన్ స్టా స్టోరీలో పెడుతూ.. “అందర్నీ ఎలిమినేట్ చేస్తూ చివరికి తనే ఎలిమినేట్ అయ్యాడు..” ఓ మీమ్ పేజ్ పోస్టుని న ఇన్ స్టాలో షేర్ చేశాడు సందీప్. అంతేకాదు.. పాజిటివ్ వైబ్స్ అంటూ ఇన్ స్టా స్టోరీ రాసుకొచ్చాడు