ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరో తెలుసా..శోభను కాపాడుతుంది అందుకేనా..? Big boss 7 Telugu voting results week9:
బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్.. చిన్నా పెద్దా ముసలి ముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్న ప్రోగ్రాం ఇది. కేవలం చూసి ఎంజాయ్ చేయడమే కాదు, ఈ బిగ్ బాస్ మీద స్పూఫులు చేస్తూ వీడియోలు కూడా చేసే ఔత్సాహిక కళాకారులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి లేదు.
ఈ సీజన్ బిగ్ బాస్ లో అంత పసలేదు అంటూనే ఉంటారు కానీ ఎగబడి చూస్తారు. ఇదేమి విచిత్రమో అర్ధం కాదు. మొత్తానికి ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎదో మాయ ఉంది. అది అందరిని ఇట్టే ఆకర్షిస్తోంది. ఇక తాజా ఎపిసోడ్ గురించి ఒక లుక్కేద్దాం రండి.
ఇప్పటి వరకు చూసుకుంటే ప్రిన్స్ యవర్ కి 27 శాతం ఓటింగ్ వచ్చింది. అమర్ దీప్ కి 20 శాతం, బోలె శావళికి 19 శాతం వచ్చింది. మిగిలిన కంటెస్టెంట్ల ఓటింగ్ వీరికన్నా దిగువనే ఉంది.
ఓవరాల్ ఓటింగ్ శాతం లో దాదాపు 60 శాతం ఓటింగ్ ఈ ముగ్గురే పంచుకోగా మిగిలిన 40 – 30 శాతం ఓటింగ్ ను మిగతా కంటెస్టెంలు సరిపెట్టుకుంటున్నారు. రతికకు 11%, అర్జున్ కి 10%, ప్రియాంక 6%, శోభా కి కూడా 6% శాతమే ఓటింగ్ వచ్చింది.
ఇక లాస్ట్ ప్లేస్ లో తేజా 4% శాతంలో ఉన్నాడు. ఇక ఎలిమినేషన్ సింగల్ అయితే తేజా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా డబుల్ ఎలిమినేషన్ ఉంటె గనుక తేజాతోపాటు శోభా కానీ ప్రియాంక కానీ ఎవరో ఒకరు బయటకు రాక తప్పదు.
ఇక తేజాకి కూడా తాను ఎలిమినేటి అవుతాను అన్న విషయం అర్ధమైనట్టు తెలుస్తోంది. ఏడోవారం పూజ వల్ల ఎలిమినేషన్ కాలేదు, మరి 9వారం ఎలిమినేట్ కాకుండా ఆగాలి అంటే ఎవరు అడ్డం పడాలో చూడాలి.
అయితే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే బాగా నెగిటివిటి తెచ్చుకున్న శోభా ఎలిమినేటి అవ్వాలి అని ఎక్కువ మంది కోరుకుంటున్నారు, మరి ఆలా జరుగుతుందా అంటే.. ఆ ఛాన్స్ మాత్రం ఈ వారంలో లేదనే చెప్పాలి.
ఎందుకంటే శోభా మొదటి లేడి కంటెస్టెంట్ పైగా ఫస్ట్ వుమెన్ కంటెస్టెంట్ కూడా శోభనే. పైగా ఫస్ట్ అండ్ లాస్ట్ వుమెన్ కెప్టెన్ అయ్యే అవకాశంకూడా శోభకే ఉంది అంటున్నారు కొందరు విశ్లేషకులు.
కెప్టెన్ అయినంత మాత్రాన ఎలిమినేటి అవ్వదా, ఆమె మీద చాలా మందికి కోపం ఉంది కదా ఆ నెగిటివిటీని ఆమె తెచ్చుకుంది కదా అంటే, అవును తెచ్చుకునే ఉండొచ్చు కానీ ఓట్లు పరంగా కొద్దిగా మార్జిన్ ఉన్న చాలు ఎలిమినేషన్ నుండి తప్పించుకోవడానికి.
శోభా విషయంలో ఒక విచిత్రమైన ఘటన కూడా ఉంది. శోభకు ముందు, వరుసగా ఏడు వరాల పటు అమ్మాయిలే ఎలిమినేటి అయ్యారు. కానీ శోభా వరకు వచ్చేసరికి ఆ ఎలిమినేషన్ ఆగింది.
అక్కడి నుండి అబ్బాయిలే హౌస్ నుండి బయటకు వెళుతున్నారు. ఇక బిగ్ బాస్ కూడా తన మనసులో ఎవరిని గెలిపించాలని భావిస్తున్నాడో, వారికే ఎక్కువ అనుకూలతను హౌస్ లో క్రియేట్ చేస్తున్నాడు.
అవన్నీ మనకు టాస్కుల్లో కూడా బాగా అర్ధమవుతూనే ఉన్నాయి. ప్రధానంగా బాల్స్ టాస్క్ లో ఆవిషయం అందరికి అర్ధమైంది. ఇక నిన్నటి లైవ్ చుస్తే అమర్ దీప్ శోభను గెలిపించడానికి ఎంతలా తాపత్రయపడ్డాడో అర్ధం అయిపోతుంది.
ఈ ఒక్క వారం శోభను కాపాడితే చాలు, వచ్చే వారం ఎలాగూ నామినేషన్ కు రాదు. దానివల్ల రెండు వరాల పాటు కావలసినంత కంటెంట్ వచ్చేస్తుంది. నిన్నా మొన్నా మనకు శోభా ఎన్నడూలేని చిత్ర విచిత్రాలు చూపెట్టింది అనే చెప్పొచ్చు.
పల్లవి ప్రశాంత్ కు భోజనం కూడా తినిపించింది. ఒకప్పుడు నువ్వు నాకు అన్నవి కాదు నేను నీకు చెల్లిని కాదు అని చెప్పిన శోభా, నిన్నటికి నిన్న అన్నా నీ టీషర్ట్ సూపర్ అని చెప్పింది.
ఇవన్నీ ఎందుకంటే ఎలిమినేషన్ ను ఎవాయిడ్ చేయడానికే, ఆతరువాత సేఫ్ జోన్ లోకి వెళ్ళాక గాని పాత శోభా వచ్చేసింది అని చూసే ప్రేక్షకులకు అర్ధం కాదు. ఇక అమర్ దీప్ గురించి ఒక విషయం చెప్పాలి.
నిన్నటి గేమ్ ను అమర్ చాలా దారుణంగా ఆడాడు అని చెప్పొచ్చు. మొన్నటి స్టిక్స్ గేమ్ ను బాగా రక్తి కట్టించిన అమర్, నిన్నటి గేమ్ లో రచ్చ చేశాడని చెప్పాలి.
అవతలి టీమ్ లో ఉన్న శివాజీకి చేయి బాలేదు, పైగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ మీద వీర లెవెల్ ప్రతాపం చూపెట్టాడు. అవి తప్పకుండ అమర్ కు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది.