Big changes not TS its TG now : ఇక నుంచి TS కాదు TG. రేవంత్ సర్కార్ మరొక సంచలన నిర్ణయం!

website 6tvnews template 16 Big changes not TS its TG now : ఇక నుంచి TS కాదు TG. రేవంత్ సర్కార్ మరొక సంచలన నిర్ణయం!

Big changes not TS its TG now : రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. గత ప్రభుత్వం చేసిన చాలా పథకాలకు పేరు మార్చేసి అమలుపర్చేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రం పేరునే మార్చనుంది. ఇక మీదట నెంబర్ ప్లేట్లపై ఉండే టీఎస్ అనే అక్షరాల కు బదులు టీజీ అని మార్చాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయి.

తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ అని వచ్చేలా TS అని షార్ట్ ఫాంని ప్రభుత్వం రిజిస్టర్ చేయించింది. కేవలం నెంబర్ ప్లేట్లపైనే కాకుండా. అన్ని ప్రభుత్వ సంస్థలకు కూడా తెలంగాణ స్టేట్ అని వచ్చేలా పేర్లు మారిపోయాయి. అయితే.. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మార్చాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ‘టీఎస్’ అనే షార్ట్ ఫాంను.

ఇప్పుడు టీజీ (TG- Telangana) గా మార్చాలని నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో ‘టీజీ’ అంశం మీద చర్చించగా.. మంత్రి వర్గం కూడా ఆమోదం తెలిపింది. అయితే.. తెలంగాణ ఏర్పడిన సమయంలోనే “టీజీ”గా నిర్ణయిస్తారని అందరూ అనుకున్నారు. అప్పటికే ఉద్యమం సమయంలోనూ తెలంగాణను టీజీగా మాట్లాడుకునేవారు. కానీ.. అనూహ్యంగా టీఎస్ అని తెలంగాణ పేరును కేసీఆర్ సర్కార్ రిజిస్ట్రేషన్ చేపించింది. దీనిపై మొదట్లో వ్యతిరేకత కూడా వచ్చింది.

అయితే.. ‘టీజీ’ అంటే తెలంగాణ అనే ఒకే పదాన్ని రెండుగా విభజించినట్టు అవుతుందని.. అది ఒకటే పదంగా ఉంచేందుకే తెలంగాణ స్టేట్ అని వచ్చేలా ‘టీఎస్‌’ అనే అక్షరాలను రిజిస్టర్ చేపించినట్టు పలువురు వివరించారు. అయితే.. తెలంగాణకు కేంద్రం మొదట TG అనే అక్షరాలు సూచించగా.. కేసీఆర్ సర్కార్ మాత్రం దాన్ని కాదని.. TS గా మార్చిందని మంత్రులు తెలిపారు. అయితే.. కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్‌ (TRS) గా ఉండటంతో.

రాష్ట్రం పేరులో కూడా అవే అక్షరాలు ప్రతిబింబించేలా TS అని మార్చినట్టుగా కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా.. టీఎస్ ను ఇక నుంచి టీజీగా మారుస్తామని ప్రభుత్వం నిర్ణయించుకోగా.. ఈ నిర్ణయంపై ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది వేచి చూడాల్సిందే.

Leave a Comment