Pushpa2 Delayed?: సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ( Allu arjun)నటించిన మూవీ పుష్ప (pushpa)ఎంతటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా పుష్ప మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. అల్లు అర్జున్ హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్ కు ఆల్ ఇండియా ఫిదా అయిపోయింది.
ఈ మూవీలో అల్లు అర్జున్ కు జోడీగా నటించిన రష్మిక మందన(Rashmika Mandanna) కూడా నేషనల్ క్రష్ గా మారిపోయింది. పుష్పకు వచ్చిన రెస్పాన్స్ చూసి దానికి సీక్వెల్ ను అదే రేంజ్ లో తీసేందుకు డైరెక్టర్ సుకుమార్ ఓ రేంజ్ లో కసరత్తు చేస్తున్నాడు.
ఇక ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ (Pushpa the raise)లో తన థ్రిల్లింగ్ పెర్ఫార్మెన్స్ తో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు.
ఇక అప్పటి నుంచి అభిమానులు పుష్పకు సీక్వెల్ గా వస్తున్న ‘పుష్ప: ది రూల్’ (pushpa2 The Rule) కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో ప్రేక్షకుల్లో భారీ అంచాలను ఏర్పడ్డాయి.
ఈ చిత్రం ప్రస్తుతం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ కొత్త ఏడాది ఆగస్టు 15(August 15) న స్వతంత్ర దినోత్సవం రోజు పుష్ప2ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా పుష్పా2 నుంచి వచ్చిన అప్డేట్ చూసి ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
సినిమా రిలీజ్ డేట్ వాయిదాలో పడిందా? అన్న సందేహంలో పడిపోయారు. లేటెస్టుగా మూవీ నుంచి విడుదలైన పోస్టరే ఇన్ని కన్ఫ్యూజన్లకు కారణమైందా? ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
pushpa2 Dlayed due to Jagdish? : జగదీశ్ వల్లే ఆలస్యమా?
తాజాగా కొన్ని రిపోర్టులు ప్రకారం పుష్ప 2 (Pushpa2) సినిమా వాయిదా పడనుందని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ దీనికి సంబంధించి ఓ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
దీంతో పుష్ప2 విడుదల తేదీ గురించి నెట్టింట్లో బన్నీ ఫ్యాన్స్ తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. పుష్ప2లో కేశవా అనే కీలకమైన పాత్రలో కనిపించిన జగదీశ్ (Jagadeesh) ప్రస్తుతం జైల్లో ఉండటం వల్లే సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతోందని,
అందుకే సినిమా విడుదల తేదీ పోస్ట్‌పోన్ అయ్యిందనే టాక్ జోరుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. వాస్తవానికి పుష్ప2, అజయ్ దేవ్గన్ (Ajay Devagan) నటించిన సింగం అగైన్ (Singam Again)
సినిమాలు రెండూ కూడా ఆగస్టు 15న విడుదలకు రెడీ అయ్యాయి. కానీ వాయిదా వార్తల కారణంగా ఇప్పుడు ఈ తేదీలో కేవలం అజయ్ దేవ్గన్ సినిమా ఒక్కటే విడుదల కాబోతోందని సమాచారం.
Bunny fans deeply disappointed : తీవ్ర నిరాశలో బన్నీ ఫ్యాన్స్
నిజానికి పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాల కంటే హిందీ బెల్ట్ లోనే భారీ వసూళ్లను రాబట్టింది. ఇఫ్పుడు పుష్ప 2 కోసం అక్కడి ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.
మూవీ నుంచి అప్డేట్స్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ లెక్కన అల్లు అర్జున్ మానియాతో పుష్ప2 కూడా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విడుదల తేదీ వాయిదా అన్న న్యూస్ ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. పుష్ప సినిమా విడుదలై రెండేళ్లవుతోంది.
అయినా ఇప్పటి వరకు సీక్వెల్ ఓ కొలిక్కి రాలేదు. ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఆగస్ట్ 15న రిలీజ్ అని మేకర్స్ అనౌన్స్ అయితే చేశారు కానీ న్యూ ఇయర్ రోజున కనీసం ఒక టీజర్ కూడా వదల్లేదు. దీంతో ఫ్యాన్స్ వాయిదా వార్త వాస్తవమే అని భావిస్తున్నారు.
Pushpa2 theatrical rights Rs. 200 crores పుష్ప2 థియేట్రికల్ రైట్స్ రూ.200 కోట్లు
పుష్ప(Pushpa) హిట్ తో అంతకు మించిన భారీ బడ్జెట్ తో పుష్ప ది రూల్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ (Theatrical rights) తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.200 కోట్లకు సేల్ అవుతున్నట్లు టాక్.
ఇప్పటి వరకూ సౌత్ సెన్సేషనల్ మూవీ ఆర్ఆర్ఆర్(RRR)మాత్రమే ఇంత భారీ మొత్తానికి అమ్ముడైంది. రీసెంట్ గా రిలీజైన డార్లింగ్ ప్రభాస్ ( Prabha)
నటించిన సలార్ (Salaar) మూవీ రూ.160 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ క్రమంలో పుష్ప 2 థియేట్రికల్ రైట్స్ విషయంలో కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని బయ్యర్లు భావిస్తున్నారని ఇన్ఫర్మేషన్