Sreeleela: శ్రీలీల ఫ్యాన్స్‎కు బిగ్ షాక్..కారణం ఇదేనా?

Big shock for Srileela fans..is this the reason?


Sreeleela: శ్రీలీల ఫ్యాన్స్‎కు బిగ్ షాక్..కారణం ఇదేనా?

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల సడెన్ గా తన ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. గత సంవత్సర కాలంగా వరుస సినిమాలతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉంది శ్రీలీల.

రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమాతో ఈ బ్యూటీ ఫేమ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మూవీలో శ్రీలీల తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఇండస్ట్రీని షేక్ చేసేసింది.

ఫిల్మ్ మేకర్స్ ని అట్రాక్ట్ చేసింది. దీంతో యువ హీరోలకు బెస్ట్ ఛాయిస్ గా మారింది శ్రీలీల. ధమాకా మూవీ తర్వాత వచ్చిన స్కంద, ఎక్స్‏ట్రా ఆర్టినరీ మ్యాన్, ఆదికేశవ , మూవీస్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.

కానీ బాలయ్య బాబు మూవీ భగవంత్ కేసరి మంచి హిట్ అందుకుంది. ఇక కొత్త సంవత్సరం మొత్తం శ్రీలీలదే హవా ఉంటుందనుకుని భావిస్తే భామ తాజాగా బాంబు పేల్చింది. సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంటున్నట్లు లేటెస్టుగా ప్రకటించింది.

టాలీవుడ్ లో అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది శ్రీలీల. తెలుగులో మోస్ట్ వాంటెడ్ నటిగా గుర్తింపు సంపాదించింది . అందానికి అందం అందుకు తగ్గట్లుగా అభినయంతో,

అంతకు మించి హీరోలకు సమానంగా డాన్స్ స్టెప్పులతో దుమ్ముదులిపేసింది శ్రీలీల. ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లను సైతం పక్కకు నెట్టి టాప్ లెవెల్ లో కూర్చుకుంది. కేవలం ఒక సంవత్సరంలో ఈ చిన్నది అర డజనుకు పైగా సినిమాల్లో నటించి అందరినీ అవాక్కు చసింది.

చిన్న హీరో , పెద్ద హీరో అనే తేడా లేకుండా దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలనే సామెతను నమ్ముకుని తనదగ్గరికి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది శ్రీలీల.

ప్రస్తుతం శ్రీలీల తెలుగులో పలు సినిమాలు చేస్తోంది. అవన్నీ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ ,

ఒకటి కాగా.ప్రిన్స్ మహేష్ నటిస్తున్న గుంటూరు కారం మూవీ మరొకటి. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి.

రీసెంట్ గానే గుంటూరు కారంలో ఓ మాస్ సాంగ్ షూట్ జరిగింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.

ఇదిలా ఉంటే శ్రీలీల తనకు ఇష్టమైన యాక్టింగ్ తో పాటు చదువును బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. ఓ వైపు వరుసగా క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూనే మరోవైపు ఎంబీబీఎస్ చదువుకుంటోంది.

అయితే గత కొంత కాలంలో ఫుల్ బిజీగా క్షణం తీరిక లేకుండా షూటింగ్లతో గడుపుతున్న శ్రీలీల చిత్రాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మెడిసిన్ సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో ఇండస్ట్రీకి కొన్ని రోజులు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యిందట. పరీక్షలు పూర్తి అయ్యేవరకు సినిమాలు చేయనని డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ముంబైలో ఎంబీబీఎస్ లాస్ట్ ఇయర్ చదువుతుంది శ్రీలీల.దీంతో సినిమాలకు బై బై చెప్పి ఇప్పుడు ఎగ్జామ్స్ కోసం ముంబై వెళ్లినట్లు సమాచారం.

అప్పటి వరకు షూటింగ్ లన్నీ బంద్ అని తెలుస్తోంది. శ్రీలీల తల్లి కూడా ఓ డాక్లరే. కూతురి కెరీర్ కోసం ఆమె తన ప్రొఫెషన్ ను వీడి అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది.

Leave a Comment